Omicron: సౌదీ అరేబియాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు

Omicron: ఉత్తర ఆఫ్రికా వెళ్లి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ * ఐసోలేషన్‌లో ఉంచిన అధికారులు

Sandeep Eggoju
Published on: 2 Dec 2021 7:01 AM IST
First Omicron Case Registered in Saudi Arabia
X
సౌదీ అరేబియా లో మొదటి ఓమిక్రాన్ కేసు నమోదు (ఫైల్ ఇమేజ్)

Omicron: ప్రపంచాన్ని వణికిస్తున్న 'ఒమిక్రాన్‌' కరోనా వేరియంట్‌ కేసు సౌదీ అరేబియాలో వెలుగు చూసింది. ఈ దేశంలో నమోదైన తొలి ఒమిక్రాన్ కేసు ఇదేనని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి సౌదీ పౌరుడేనని, అయితే తాజాగా ఉత్తర ఆఫ్రికా వెళ్లి తిరిగొచ్చాడని అధికారులు చెప్పారు. ఒమిక్రాన్ సోకడంతో అతన్ని ఐసోలేషన్‌లో ఉంచామని, అలాగే అతనితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారిని కూడా ఐసోలేట్ చేశామని వివరించారు. ఈ క్రమంలో ప్రజలంతా వ్యాక్సిన్‌ పూర్తి డోసులు తీసుకోవాలని సౌదీ ప్రభుత్వం సూచించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story