First Corona Death in Vietnam: వియత్నాంలో తొలి కరోనా మరణం

First Corona Death in Vietnam: వియత్నాంలో తొలి కరోనా మరణం
x
Representational Image
Highlights

First Corona Death in Vietnam: యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతున్నాయి. దీంతో పలు దేశాలు గజగజ వణికిపోతున్నాయి

First Corona Death in Vietnam: యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతున్నాయి. దీంతో పలు దేశాలు గజగజ వణికిపోతున్నాయి. కరోనా కట్టడిలో ప్రపంచ దేశాలకు మార్గ‌ద‌ర్శిగా ఉన్న వియత్నాంలో పరిస్థితులు మారాయి. ఈ దేశంపై కూడా క‌రోనా త‌న పంజాను విరిసింది. తాజాగా వియత్నంలో తొలి కరోనా మరణం నమోదైంది. ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

డానాంగ్‌లో ఇటీవల ఓ వృద్ధుడికి కరోనా బారినపడి మరణించాడు. ప్రాంతంలో కరోనా కేసులు నమోదవుతుండటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే డానాంగ్ నుంచి హానోయి వచ్చిన వారిందరికీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. కాగా వియత్నం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 509 మంది కరోనా బారిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories