ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం..

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం..
x
Highlights

ఫేస్ బుక్ ఒక్కసారి ఆగిపోతే ప్రపంచంలో దాదాపు సగం మంది ఫేస్ లు మాడిపోతాయి. ఇంస్టాగ్రామ్ మొరాయిస్తే దాదాపు అంతమందీ బావురు మంటారు. ప్రస్తుతం పరిస్థతి అలా...

ఫేస్ బుక్ ఒక్కసారి ఆగిపోతే ప్రపంచంలో దాదాపు సగం మంది ఫేస్ లు మాడిపోతాయి. ఇంస్టాగ్రామ్ మొరాయిస్తే దాదాపు అంతమందీ బావురు మంటారు. ప్రస్తుతం పరిస్థతి అలా ఉంది. అందులోనూ ఆదివారం అలా జరిగితే? సరిగ్గా నిన్న ఆదివారం అలానే జరిగింది. ఒక్కసారిగా ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లు సరిగా పనిచేయడం మానేశాయి. దీంతో యూజర్లు ఆందోళనకు గురయ్యారు.

ఫేస్ బుక్ స్టేటస్ అప్‌డేట్ కావట్లేదని.. వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోలేకపోతున్నామని, కామెంట్లు పెట్టలేకపోతున్నామని యూజర్లు ఫిర్యాదులు చేశారు. అంతేకాదు తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లోకి సైన్-ఇన్ కాలేకపోతున్నామని పలువురు యూజర్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్య ఆదివారం సాయంత్రం తలెత్తింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య తలెత్తినట్లు పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, ఆసియాలోని పలు దేశాల్లో ఈ సమస్య తలెత్తినట్లు తెలిసింది. ఇటీవల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ సేవలకు తరచూ అంతరాయం కలుగుతోంది. జూలై 3 వతేదీన కూడా ఇటువంటి సమస్య తలెత్తింది. అయితే, దీనిపై సంస్థ యూజర్లకు కలిగిన సౌకర్యానికి మన్నింపు కోరింది. ఇప్పుడు తాజాగా ఆదివారం కొంత సేపు ఈ సేవలు దొరకక పోవడం విశేషం.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మూడూ ఒకే సర్వర్ ను పంచుకున్తున్నట్టు చెబుతున్నారు. దీంతో ట్రాఫిక్ పెరిగిపోవడంతో ఒక్కోసారి సర్వర్ మొరాయిస్తోందని నిపుణులు చెబుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories