Suez Canal: సూయజ్ కెనాల్‌లోకి మరో భారీ నౌక..!

Ever Ace Ship Journey Started From Britain in Suez Canal
x

ఎవర్ ఏస్ నౌక (ఫైల్ ఇమేజ్)

Highlights

Suez Canal: బ్రిటన్ నుంచి ప్రయాణం ప్రారంభించిన 'ఎవర్‌ ఏస్‌'

Suez Canal: ప్రపంచ వాణిజ్య సముద్ర మార్గం సూయజ్ కెనాల్‌లో వరల్డ్‌లోనే భారీ నౌక ప్రవేశించబోతుండడం హాట్‌టాపిక్ అవుతోంది. ఈ ఏడాది మార్చ్‌లో సూయజ్ కెనాల్‌ ట్రాఫిక్ జామ్‌కు కారణమైన ఎవర్ గివెన్ నౌకను మించిన ఓడ కావడంతో ఏం జరుగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. బ్రిటన్‌లోని సఫోల్క్‌లో ఉన్న ఫ్లెగ్జిస్టోవ్ సౌకాశ్రయం నుంచి ఈ భారీ నౌక ప్రయాణం ప్రారంభించినట్లు తెలుస్తోంది. భారీ కంటెయినర్ల లోడ్‌తో రాటర్‌డామ్‌కు చేరుకొనేందుకు ఎవర్‌ గివెన్‌ వెళ్లిన మార్గంలోనే సూయజ్‌ కెనాల్‌ గుండా వెళ్లనుండడంతో అందరి దృష్టి ఈ నౌకపైనే పడింది. ఎవర్‌ గివెన్‌కు 20వేల 124 కార్గో యూనిట్లను మోసుకెళ్లే సామర్ధ్యం ఉండగా.. ఎవర్‌ ఏస్‌ ఏకంగా 23వేల 992 కంటెయినర్లను మోసుకెళ్లేలా తయారు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories