Elon Musk: నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఎలాన్‌ మస్క్‌ ట్వీట్

Elon Musk: అసలే నాకు సిగ్గు ఎక్కువ అంటూ అమెరికా సెనేటర్‌ అలెగ్జాండ్రియాకు రీట్వీట్‌

Rama Rao
Updated on: 3 May 2022 10:00 AM IST
Elon Musks Tweet Impresses Netizens | Telugu Online News
X

నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఎలాన్‌ మస్క్‌ ట్వీట్

Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఏం చేసినా సంచలనంగా మారుతోంది. ఇటీవల మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ను భారీ ధరకు కొనుగోలు చేసి ప్రపంచ వ్యాప్తంగా చర్చలకు తావిచ్చారు. ఎప్పుడు ఎలాన్‌ ఎలాంటి ట్వీట్‌ పెడుతారోనని ఫాలోవర్లు ఎదురుచూస్తుంటారంటే అతిశయోక్తి కాదేమో ఆపండి నాకు అసలే సిగ్గు ఎక్కువ అంటూ తాజాగా అమెరికా సెనేటర్‌ అలెగ్జాండ్రియా ఒకేసియానుద్దేశించి ట్విట్టర్ వేదికగా మస్క్‌ కామెంట్‌ చేశారు. మస్క్‌ చేసిన ఈ ట్వీట్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

అంతకుముందు సోషల్ మీడియాపై అలెగ్జాండ్రియా ఓ ట్వీట్ చేశారు. ''ఓ బిలియనీర్ ఓ పెద్ద సామాజిక మాధ్యమాన్ని పూర్తిస్థాయిలో తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దీంతో విద్వేషపూరిత వ్యాఖ్యలు అడ్డూ అదుపు లేకుండా పెరిగే అవకాశం ఉందని నాకు ఆందోళ పెరుగుతోంది. ఎక్కువవుతోంది'' అని ఆమె ట్వీట్ చేశారు. దీనికి వెంటనే మస్క్ రిప్లయ్‌ ఇచ్చారు. నాకు లైనేయడం ఆపు నాకసలే సిగ్గెక్కువ అంటూ తుంటరిగా ట్వీట్ చేశారు. అయితే అలెగ్జాండ్రియా కూడా అదే స్థాయిలో స్పందించారు. ''నేను మాట్లాడింది మార్క్‌ జూకర్‌బర్గ్‌ గురించి అంటూ మస్క్‌ స్పీడుకు బ్రేకులు వేశారు. ప్రస్తుతం వీరి ట్వీట్లు, రీ ట్వీట్లపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story