Viral Photo: మస్క్ కుమారుడిని హెలికాప్టర్ ఎక్కించిన ట్రంప్..ఫొటో వైరల్

Viral Photo: మస్క్ కుమారుడిని హెలికాప్టర్ ఎక్కించిన ట్రంప్..ఫొటో వైరల్
x
Highlights

Viral Photo: అపరకుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నాలుగేళ్ల కుమారుడి A-X12మరోసారి ఇంటర్నెట్ ద్రుష్టిని ఆకర్షించాడు.

Viral Photo: అపరకుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నాలుగేళ్ల కుమారుడి A-X12మరోసారి ఇంటర్నెట్ ద్రుష్టిని ఆకర్షించాడు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ గార్డెన్ లో ఈ చిన్నారితో కలిసి అధ్యక్షుడు ట్రంప్ నడుస్తున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వారాంతం కోసం ట్రంప్ ఫ్లోరిడాలోని తన నివాసానికి బయలుదేరారు. ఆయనతోపాటు మస్క్ కూడా వెళ్లారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ సౌత్ లాన్ లో పార్క్ చేసిన మెరైన్ వన్ హెలికాప్టర్ ఎక్కేందుకు ట్రంప్ వెళ్తుండగా ఆయన వెనక మస్క్ కుమారుడు నడుస్తూ వచ్చాడు. హెలికాప్టర్ మెట్లు ఎక్కేందుకు ఆ చిన్నారి ఇబ్బంది పడుతుండగా ట్రంప్ స్వయంగా అతన్ని లోపలికి ఎక్కించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై మస్క్ స్పందిస్తూ..హ్యాపీ పిక్చర్ అంటూ రాసుకొచ్చాడు.


కాగా ఈ ఫొటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చిన్నారి మస్క్ ట్రంప్ ను ఏమని పిలిచారు..అంటున్నారు. దీంతో డొనాల్ట్ ట్రంప్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories