ఎలాన్ మస్క్ తండ్రి సంచలనం.. పెంపుడు కుమార్తెతో బిడ్డను కన్న..

Elon Musks Father Reveals Having Secret Second Child With Stepdaughter
x

ఎలాన్ మస్క్ తండ్రి సంచలనం.. పెంపుడు కుమార్తెతో బిడ్డను కన్న..

Highlights

Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్‌ మస్క్‌(76 ) సంచలన విషయాన్ని వెల్లడించారు.

Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్‌ మస్క్‌(76 ) సంచలన విషయాన్ని వెల్లడించారు. మూడేళ్ల క్రితం తన సవతి కుమార్తె 35 ఏళ్ల జానా బెజుడెన్ హౌట్ తో రహస్యంగా బిడ్డకు జన్మనిచ్చానని తెలిపాడు. బ్రిటీష్ టాబ్లాయిడ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఎర్రోల్ మస్క్ వెల్లడించారు. 76 ఏళ్ల ఎర్రోల్‌ 2019 లో 35 ఏళ్ల బెజుడెన్‌హౌట్‌తో ఒక కుమార్తెకు తండ్రి అయిన‌ట్లు చెప్పాడు. "మనం భూమిపై ఉన్న ఏకైక కార‌ణం పునరుత్పత్తి కోసమే," అని ఆయ‌న సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేశాడు.

జానా బెజుడెన్‌హౌట్ ఎర్రోల్ మస్క్ రెండవ భార్య హీడే బెజుడెన్‌హౌట్ కుమార్తె. 1979లో ఎలాన్ మస్క్ తల్లి మేయే హాల్డెమాన్ మస్క్ తో విడిపోయిన తర్వాత రెండో వివాహం చేసుకున్నాడు. ఎర్రోల్, హీడ్ లు అప్పటికే పిల్లుల కలిగి ఉన్నారు. ఎర్రోల్ జానా బెజుడెన్‌హౌట్ కు సవతి తండ్రి. రెండో వివాహం జరిగిన తర్వాత 18 ఏళ్లకు ఎర్రోల్, హీడ్ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత సవతి కూతురుతోనే అనైతిక సంబంధాన్ని పెట్టుకున్నాడు ఎలాన్ మస్క్ తండ్రి.

ఎర్రోల్‌ మస్క్‌ కుమారుడు ఎలన్‌ మస్క్‌ కూడా తన తొమ్మిది మంది సంతానంపై ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తగ్గిపోతున్న జనాభా సంక్షోభానికి తమ వంతు సాయం చేస్తున్నట్లు ట్వీట్‌ చేశాడు. ఇప్పుడు ఎలన్‌ మస్క్‌కు ఏ మాత్రం తీసిపోనంటూ ఆయన తండ్రి ఎర్రోల్‌ మస్క్‌ కూడా ఈ తరహా వ్యాఖ‍్యలు చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories