Elon Musk : భారతీయ వంటకాలకు ఎలాన్ మస్క్ ఫిదా.. నెట్టింట ట్వీట్ వైరల్

* భారత సంస్కృతి సంప్రదాయాలే కాదు భారతీయుల వంటకాలు సైతం విదేశీయులను తెగ ఆకర్షిస్తున్నాయి. ప్రపంచ ప్రముఖులు ఎందరో ఇండియన్ ఫుడ్స్ కు ఫిదా కాగా ఈ జాబితాలో తాజాగా ఎలాన్ మస్క్ చేరారు. ఇండియన్ ఫుడ్ పై తన మక్కువ చాటుకోవడంతో.. ఇండియాకు ఎప్పుడు వస్తారంటూ నెటిజన్స్ కామెంట్స్ తో హోరెత్తించేస్తున్నారు.

Dhatripriya
Updated on: 16 May 2023 8:31 PM IST
Elon Musk Tweets In Praise Of Insanely Good Indian Food Internet Goes Crazy
X

Elon Musk : భారతీయ వంటకాలకు ఎలాన్ మస్క్ ఫిదా.. నెట్టింట ట్వీట్ వైరల్

Elon Musk: ప్రపంచదేశాలలో మన భారతీయ సంస్కృతికి విశిష్టమైన స్థానం ఉంది. మన జీవన విధానం సైతం విదేశీయులను ఆకర్షిస్తూ ఉంటుంది. కేవలం భారత సంస్కృతి మాత్రమే కాదు మన వంటకాలకు సైతం విదేశీయులు ఎందరో దాసోహం అన్నవారే..భారతీయ రుచులు అంటే ఎంతో ఇష్టమని దేశాధినేతలు, హాలీవుడ్ నటీనటులు, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఎందరో చెప్పారు. ఇండియా వచ్చినప్పుడు రుచి చూసిన వంటకాలను గుర్తుపెట్టుకొని...తిరిగి తమ దేశానికి వెళ్లాక, అక్కడ అలాంటి రుచులను అందించే భారతీయ రెస్టారెంట్లకు వెళ్తుంటారు. అందుకే చాలా దేశాల్లో ఇండియన్ రెస్టారెంట్లకు అమితమైన ఆదరణ లభిస్తోంది.

భారతీయ వంటకాలను ఇష్టపడే విదేశీయుల జాబితాలో ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా చేరాడు. డేనియల్ అనే ఓ ట్విట్టర్ యూజర్ భారతీయ వంటకాల గురించి ఓ పోస్టు పెట్టాడు. అందులో నోరూరించే బటర్ చికెన్, నాన్, అన్నం ఫోటోలను షేర్ చేస్తూ ఇండియన్ ఫుడ్ ను తానెంతో ఇష్టపడతానని కామెంట్ చేశాడు. డేనియల్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

డేనియల్ చేసిన ట్వీట్ ఎలాన్ మస్క్ ను ఆకర్షించింది. మీరు చెప్పేది నిజమేనంటూ ఆ వ్యక్తి ట్వీట్ కు మస్క్ రెస్పాండ్ అయ్యాడు. ఇండియన్ ఫుడ్ పై తనకున్న అభిప్రాయాన్ని మస్క్ వెల్లడి చేయడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. మస్క్ భారత్ వచ్చి ఇక్కడి వంటకాలను రుచి చూడాలంటూ కోరుతున్నారు. త్వరలోనే భారత పర్యటనకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో వివిధ రకాల వంటకాలను ఎప్పుడు టేస్ట్ చేస్తారు అని కామెంట్స్ పెడుతున్నారు.


Dhatripriya

Dhatripriya

Next Story