Elon Musk: ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు

Elon Musk: యుద్ధంలో వెనక్కి తగ్గితే పుతిన్‌ను చంపేస్తారన్న మస్క్

Jyothi
Published on: 15 Feb 2024 10:01 AM IST
Elon Musk Key Comments on Ukraine Russia War
X

Elon Musk: ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు

Elon Musk: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ అన్నారు. ఒకవేళ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఈ విషయంలో వెనక్కి తగ్గితే ఆయనను హతమార్చే అవకాశం ఉందని చెప్పారు. అందువల్ల ఈ పోరాటాన్ని పుతిన్‌ కొనసాగిస్తూనే ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

పుతిన్‌పై తాను చేసిన కామెంట్స్ పట్ల చాలా మంది వ్యక్తులు తనను విమర్శిస్తున్నారని మస్క్‌ వాపోయారు. విమర్శిస్తున్న వారు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఉక్రెయిన్‌లో రష్యా ఓడిపోయే అవకాశమే లేదని మస్క్ ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఉక్రెయిన్‌ గెలుస్తుందనుకోవడం ఆ దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని స్పష్టంచేశారు. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగడం ఉక్రెయిన్‌కే నష్టమన్నారు. అమెరికా తాజాగా ప్రకటించిన ఆర్థిక సాయం వల్ల ఉక్రేయిన్‌కు ఎలాంటి లాభం ఉండదని తేల్చి చెప్పారు.

రష్యాలో పుతిన్‌ను గద్దె దించాలనుకునేవారు ఆయన స్థానంలో ఎవరిని కోరుకుంటున్నారని ఎలాన్ మస్క్‌ ప్రశ్నించారు. రాబోయేవారు శాంతికాముకులు అయ్యుంటారని ఎలా ఆశిస్తారని క్వశ్చన్ వేశారు.

Jyothi

Jyothi

Next Story