పాక్ ని కుదిపేసిన భూకంపం

పాక్ ని కుదిపేసిన భూకంపం
x
Highlights

భారీ భూకంపంతో ఇండో పాక్‌ సరిహద్దు వణికింది. పాకిస్తాన్‌ సహా, ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్‌లోని లాహోర్‌కు...

భారీ భూకంపంతో ఇండో పాక్‌ సరిహద్దు వణికింది. పాకిస్తాన్‌ సహా, ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్‌లోని లాహోర్‌కు వాయువ్యదిశలో 173 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని కనుగొన్నారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.3 గా నమోదైంది. భారీ భూకంపంతో పాకిస్తాన్‌లోని ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్‌, పెషావర్‌, రావల్పిండి, లాహోర్‌ లలో ప్రజా జీవనం స్తంభించింది. భూ ప్రకంపనలతో భయపడ్డ ప్రజలంతా ఇళ్లు, కార్యాలయాలు వదిలి పరుగులు పెట్టారు.

ఈ భూకంపం ప్రభావం భారత్‌పై కూడా పడింది. ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రాజధాని న్యూ ఢిల్లీ సహా కశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా, గుర్గావ్‌ సహా పలుచోట్ల భూమి కంపించింది. జమ్మూకశ్మీర్‌లోని ఫూంచ్‌, రాజౌరీ సెక్టార్‌లలో కూడా భూమి కంపించింది. భారత కాలమానం ప్రకారం.. ఈ సాయంత్రం 4 గంటలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories