తైవాన్‌లో భారీ భూకంపం.. జపాన్, ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు

Taiwan: భూకంప ప్రభావంతో సముద్రతీరంలో పెరిగిన అలల ఉధృతి

Jyothi
Published on: 3 April 2024 8:16 AM IST
Earthquake in Taiwan
X

తైవాన్‌లో భారీ భూకంపం.. జపాన్, ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు 

Taiwan: తైవాన్‌‌లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తరతీర ప్రాంతంలో 15 నిమిషాల పాటు వరుసగా భూమి కంపించింది. భూకంప ధాటికి కూలిన పలు భవనాలు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపోయాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. 1999 తర్వాత తైవాన్‌లో ఇంతటి భారీ భూకంపం సంభవించడం ఇదే తొలిసారి అని తెలిపారు. మరోవైపు భూకంపం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో అలల ఉధృతి పెరిగింది. దీంతో జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Jyothi

Jyothi

Next Story