జపాన్ లో భారీ భూకంపం.. భూకంప తీవ్రత 7.3గా నమోదు.. సునామీ హెచ్చరికలు...

జపాన్ లో భారీ భూకంపం.. భూకంప తీవ్రత 7.3గా నమోదు.. సునామీ హెచ్చరికలు...
Japan - Earthquake: టోక్యోలో నిలిచిపోయిన కరెంట్ సరఫరా...
Japan - Earhthquake: జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. ఆదేశ రాజధాని టోక్యో నగరానికి సమీపంలో సముద్ర తీరమైన పుకుషిమా ప్రాంతంలో భూకంపం చోటుచేసుకుంది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.3గా నమోదైంది. భూ ఉపరితలం నుంచి 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జపాన్ వాతావరణ ఏజెన్సీ వెల్లడించింది.
ఇక భూకంపం సంభవించిన వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. మరోవైపు జపాన్ రాజధాని టోక్యోలోనూ భూ ప్రకంపనలు కొద్ది నిమిషాల పాటు కొనసాగుడంతో నగరమంత విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్టు సమాచారం.
టోక్యోలో 7లక్షల ఇళ్లతోపాటు మొత్తంగా 20లక్షలకు పైగా ఇళ్లల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ తెలిపింది. అదేవిధంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు ప్రారంభించినట్లు తెలియజేసింది. అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం ప్రధాని కార్యాలయం వద్ద టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. పలు మంత్రిత్వశాఖలు, మున్సిపాల్టీలు పరస్పర సహకారంతో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని జపాన్ ప్రధాని ఆదేశించారు.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
Hyderabad: నిరుద్యోగులకి అలర్ట్.. హైదరాబాద్లో భారీ జాబ్ మేళా..!
26 Jun 2022 8:19 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTహైదారబాద్లో తల్వార్, కత్తులతో యువకుల హంగామా
26 Jun 2022 7:43 AM GMTMekapati Vikram Reddy: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం
26 Jun 2022 7:19 AM GMTఎల్ బీనగర్ నియోజకవర్గంలో సామ రంగారెడ్డి పర్యటన
26 Jun 2022 6:51 AM GMT