Iraq Drone Attack: మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లిన ఇరాక్

Iraq Drone Attack: ఎర్బిల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్‌తో బాంబు దాడి

Shireesha
Updated on: 12 Sept 2021 7:00 PM IST
Drone Attack in Iraq Capital Baghdad Erbil Airport Today | International News
X

మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లిన ఇరాక్

Iraq Drone Attack: మరోసారి బాంబుల మోతతో ఇరాక్‌ దద్దలిర్లింది. ఎర్బిల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్‌తో బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఎవరికి ప్రమాదం జరగలేదని కుర్దిష్‌ భద్రతా దళాలు ప్రకటించాయి. అయితే ఇప్పటివరకు ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఎవరూ ప్రకటించుకోలేదని తెలిపాయి. విమానాశ్రయం సమీపంలోనే అమెరికన్‌ కాన్సులేట్‌ ఉండటం ఆందోళన కలిగించింది. పేలుళ్ల అనంతరం ఎయిర్‌పోర్టు దారులను మూసివేశారు. విమానాశ్రయం కేంద్రంగా జిహాద్‌ వ్యతిరేక దళాలు కూడా పనిచేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. ఇటీవల కాలంలో ఇరాక్‌లో విమానాశ్రయాలపై దాడులు సర్వసాధారణమయ్యాయి. అమెరికా దళాలు, అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story