Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ను వెంటాడుతున్న ఫేస్ బుక్
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఫేస్‌బుక్ వదిలిపెట్టడం లేదు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ను వెంటాడుతున్న ఫేస్ బుక్
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఫేస్‌బుక్ వదిలిపెట్టడం లేదు. ఆ వేదికను ఏదో విధంగా వాడుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తుంటే ఫేస్‌బుక్ వెంటనే తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా తన కోడలి ఫేస్‌బుక్ పేజీలో ట్రంప్ ప్రత్యక్షమవగానే, ఆ వీడియోలను ఫేస్‌బుక్ తొలగించి, హెచ్చరించింది.
కేపిటల్ హిల్ సంఘటనలో అల్లరి మూకలను ట్రంప్ ప్రోత్సహిస్తున్నట్లు కనిపించడంతో ఆయనపై ఫేస్‌బుక్ నిషేధం విధించింది. ట్రంప్ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను లారా ట్రంప్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. వెంటనే ఆమెకు ఫేస్‌బుక్ నుంచి ఓ ఈ-మెయిల్ వచ్చింది. ఈ వీడియోలో డొనాల్డ్ ట్రంప్ వాయిస్ ఉన్నందువల్ల తొలగించినట్లు తెలిపింది. ఇటువంటి వీడియోలను పోస్ట్ చేస్తే అదనపు ఆంక్షలు కూడా విధిస్తామని హెచ్చరించింది.
Next Story




