డోనల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన.. అమెరికాలో ఉండే NRI లకు ఇది వార్నింగ్ అనుకోవాలా?

Donald Trumps Income Tax plans in US
x

Donald Trump About India: ట్రంప్ మరో సంచలన ప్రకటన.. అమెరికాలో ఉండే NRI లకు ఇది వార్నింగ్ అనుకోవాలా?

Highlights

Donald Trump About India: డోనల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన.. అమెరికాలో ఉండే NRI లకు ఇది వార్నింగ్ అనుకోవాలా? ఇండియాపై డోనల్డ్ ట్రంప్ చేస్తోన్న ఆరోపణలు ఏంటి? ట్రంప్ వ్యాఖ్యలు అమెరికాలో ఉండే భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?

Donald Trump's Income Tax plans in US: అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని ట్రంప్ చెబుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అమెరికన్స్‌కు పన్ను భారీగా తగ్గించి, విదేశాలపై భారీగా సుంకం పెంచనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు హానీ చేసే విదేశాలు, విదేశీయులపై సుంకం పెంచనున్నట్లు చెప్పారు. అలా చెప్పే సందర్భంలో ఉదాహరణ కోసం చైనా, ఇండియా, బ్రెజిల్ వంటి దేశాల పేర్లు ప్రస్తావించారు. సోమవారం ఫ్లోరిడాలో జరిగిన రిపబ్లికన్స్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సినవి మూడు విషయాలు ఉన్నాయి. అందులో మొదటిది అమెరికన్స్‌ను ధనవంతులను చేయడం కోసం వారిపై ఇన్‌కమ్ టాక్స్ భారాన్ని తగ్గిస్తామని చెప్పడం. రెండోది విదేశాలపై, విదేశీయులపై ట్యాక్స్ భారాన్ని పెంచడం. ఇక మూడోది అమెరికాకు హానీ చేసే దేశాల పేర్లలో ఇండియా పేరు కూడా చెప్పడం.

ఓవైపు భారత్‌తో స్నేహపూర్వక వైఖరి ఉంటుందని చెబుతూనే మరోవైపు అమెరికాను ఇబ్బంది పెట్టే దేశాల జాబితాలో ఇండియాను చేర్చడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇదే ఇప్పుడు అటు అమెరికాలో ఇటు ఇండియాలో హాట్ టాపిక్ అయింది.

అమెరికాకు హానీ చేయడం అంటే?

అమెరికా దృష్టిలో హానీ చేయడం అంటే తమ దేశ ప్రయోజనాలను దెబ్బ తీసేలా వ్యవహరించడమే అని అర్థం. ఉదాహరణకు అమెరికాకు చైనా అంటే ఎందుకంత కోపమంటే... అమెరికాలో అక్కడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫెంటానిల్ అనే డ్రగ్ చైనా నుండే తమ దేశానికి వస్తోందనేది అమెరికా చేస్తోన్న ఆరోపణ.

చైనా నుండి ఫెంటానిల్ ముందుగా అమెరికా పొరుగు దేశాలైన కెనడాకు, మెక్సికో వెళ్తోందని, అక్కడి నుండి అక్రమ రవాణా మార్గాల్లో అమెరికాలోకి వస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ విషయంలో ఇప్పటివరకు అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ లైట్ తీసుకున్నారు కానీ నేనలా కాదని ట్రంప్ చెబుతున్నారు.

అమెరికా ప్రయోజనాలను చైనా దెబ్బతీస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందుకే చైనా నుండి వచ్చే దిగుమతులపై ఫిబ్రవరి 1 నుండి 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ గతంలోనే చెప్పారు. తాజాగా అమెరికాకు హానీ చేస్తోన్న దేశాల జాబితాలో చైనా పేరును కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ మరి ఆ జాబితాలో ఇండియా పేరు ఎందుకు తీసుకొచ్చారనేదే ఇప్పుడు చాలా మందికి అర్థం కాని ప్రశ్న.

ఇండియాపై డోనల్డ్ ట్రంప్ ఆరోపణలు

ఇండియాపై డోనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతేడాది సెప్టెంబర్‌ 17న అమెరికాలో ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ భారత్‌పై తన వైఖరిని స్పష్టంగా చెప్పారు. అమెరికా నుండి భారీగా దిగుమతి సుంకం వసూలు చేస్తోన్న దేశాల్లో భారత్ ముందుంది అన్నారు.

భారత్, బ్రెజిల్, చైనా వంటి దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకం వసూలు చేస్తున్నాయన్నారు. చైనా సంగతి అయితే ఇక చెప్పనక్కరేలేదన్నారు. ట్రంప్ చేస్తోన్న ఈ వ్యాఖ్యలు అమెరికాలో ఉండే భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా యూరప్ దేశాల పట్ల ట్రంప్ వైఖరెలా ఉందో ఇప్పుడు చూద్దాం.

యూరప్ దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

అమెరికా ఉత్పత్తులపై ఎవ్వరు అధిక మొత్తంలో సుంకం వసూలు చేసినా... వారికి తను అధికారంలోకి వస్తే అదే ట్రీట్మెంట్ ఇస్తామని అన్నారు. అప్పుడు చెప్పినట్లుగానే ట్రంప్ ఇప్పుడు భారీగా సుంకం పెంచుతున్నట్లు ప్రకటనలు చేస్తూ విదేశాలను బెదిరిస్తున్నారు.

యూరప్ దేశాలు కూడా అమెరికాతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం లేదని డోనల్డ్ ట్రంప్ అన్నారు. అంతేకాదు... అధ్యక్ష బాధ్యతలు తీసుకోకముందే డొనల్డ్ ట్రంప్ యురొపియన్ యూనియన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా వద్ద ఆయిల్, గ్యాస్ కొనండి... లేదంటే అమెరికా వైపు నుండి అన్నివిధాలుగా సుంకం రూపంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అమెరికాలో ఉండే భారతీయుల పరిస్థితేంటి?

అమెరికా పౌరులపై ఇన్ కమ్ ట్యాక్స్ తగ్గించి వారు మళ్లీ ధనవంతులయ్యేలా చేస్తానని ట్రంప్ చెప్పారు. అందుకే అమెరికాకే తొలి ప్రాధాన్యమిస్తూ విదేశాలపై, విదేశీయులపై సుంకం పెంచనున్నట్లు ప్రకటించారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటనలో రెండు రిస్కులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో మొదటిది ఇండియా నుండి అమెరికా వెళ్లే ఉత్పత్తులపై భారీగా సుంకం పెంచడం వల్ల అమెరికా మార్కెట్‌నే లక్ష్యంగా వ్యాపారం చేసే భారతీయ వ్యాపారుల బిజినెస్ దెబ్బ తినడం.

ఇక రెండోది ఏంటంటే... విదేశీయులపై కూడా సుంకం పెంచుతామని చెప్పడమంటే... అమెరికాలో ఉండే ఎన్నారైలు కూడా ఆ ప్రమాదంలో ఉన్నట్లే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ అదే కానీ జరిగితే... అమెరికాలో నాలుగు రాళ్లు వెనకేసుకుందామని వెళ్లిన ఎన్నారైలు అక్కడ సంపాదించింది అక్కడే ట్యాక్సులు కట్టేందుకే సరిపోతుందేననే ఆందోళన వ్యక్తమవుతోంది.

పొమ్మనలేక పొగబెట్టడమేనా?

డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో ఉన్న విదేశీయులను పొమ్మనలేక పొగపెట్టినట్లే అవుతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. విదేశీయులు భారీగా ట్యాక్సులు చెల్లించినా అది అమెరికా ఖజానాకే లాభం. ఒకవేళ అమెరికాలో విదేశీయులు ఉండలేక తమ సొంత దేశాలకు వెళ్లిపోయినా...మళ్లీ అమెరికా పౌరులకే ఆ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిలో ఏది జరిగినా అమెరికాకు ప్రత్యక్షంగానైనా లేదా పరోక్షంగానైనా లాభమే కానీ వచ్చిన నష్టమేమీ లేదనేది మేధావుల అభిప్రాయం.

Show Full Article
Print Article
Next Story
More Stories