‌ వైట్‌హౌస్‌ను వీడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్..

Arun Chilukuri
Published on: 20 Jan 2021 9:30 PM IST
‌ వైట్‌హౌస్‌ను వీడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్..
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌ను వీడారు. భార్య మెలానియాతో కలిసి ట్రంప్ వైట్‌హౌస్‌ నుంచి వైదొలిగారు. అనంతరం అక్కడి నుంచి ట్రంప్ దంపతులు నేరుగా మేరీల్యాండ్‌లోని మిలిటరీ ఎయిర్‌బేస్‌కు బయలుదేరారు. అక్కడ ట్రంప్ చివరిసారిగా ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానం ఎక్కి ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌ సమీపంలో ఉన్న మార్‌ లాగో రిసార్టుకు వెళ్లనున్నారు. ఇక ట్రంప్‌ అధ్యక్షుడిగా చివరి రోజున శ్వేత సౌధం మాజీ ఉన్నతాధికారి స్టీవ్‌ బ్యానన్‌ సహా 73 మందికి క్షమాభిక్ష ప్రకటించారు. మరో 70 మందికి శిక్షను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story