Donald Trump: దేవుడు నావైపే ఉన్నాడు..

Donald Trump: రిపబ్లికన్‌ సదస్సు చివరి రోజు పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 19 July 2024 12:23 PM IST
Donald Trump First Speech In Republican National Convention Since Assassination Attempt
X

Donald Trump: దేవుడు నావైపే ఉన్నాడు..

Donald Trump: రిపబ్లికన్‌ సదస్సు చివరి రోజు పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. దేవుడి ఆశీస్సుల వల్లే ఈరోజు మీముందు నిలబడగలిగానంటూ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఏమాత్రం పొరపాటు జరిగినా తాను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదన్నారు. అధ్యక్ష అభ్యర్థిగా ఆయన్ని ఎన్నుకున్న పార్టీ నిర్ణయాన్ని ట్రంప్‌ అధికారికంగా అంగీకరించారు. వచ్చే నాలుగేళ్లు అమెరికా చరిత్రలో నిలిచిపోతాయన్నారు. సువర్ణాధ్యాయం ప్రారంభం కాబోతోందని ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అమెరికాను తిరిగి గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానని ట్రంప్ హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా తనపై జరిగిన కాల్పుల ఘటనను ట్రంప్‌ గుర్తు చేసుకున్నారు. బుల్లెట్‌ సరిగ్గా తన దగ్గరకు వచ్చిన సమయంలో తాను తల తిప్పానని చెప్పారు. వలసదారులకు సంబంధించిన సమాచారం చూడడం కోసం చార్ట్‌ వైపు చూశానని తెలిపారు. అలా జరగకపోయి ఉంటే దుండగుడు కాల్చిన బుల్లెట్‌ లక్ష్యాన్ని చేరుకునేదని తాను ఇలా అందరిముందు నిలబడి ఉండేవాడిని కాదని వ్యాఖ్యానించారు. దేవుడి ఆశీస్సులే తనని కాపాడాయన్నారు. ఆ క్షణంలో స్వయంగా భగవంతుడే తన మృత్యువును అడ్డుకున్నాడంటూ ఉద్వేగంతో ప్రసంగించారు.

సగం అమెరికన్ల మనుసు గెలుచుకోవడంలో కిక్‌ ఉండదనే మొత్తం అమెరికా గెలుచుకోవడానికే అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను అని ట్రంప్ అన్నారు. పెద్ద రిస్క్ చేసి తన ప్రాణాలను కాపాడిన ఏజెంట్లు గొప్ప వ్యక్తులు అని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశాలకు వచ్చిన చాలామంది కూడా ట్రంప్‌ను అనుసరించి కుడిచెవికి బ్యాండేజ్ కట్టుకునే వచ్చారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story