ప్రతి అమెరికన్‌కు తగినంత కోవిడ్ వ్యాక్సిన్ : డోనాల్డ్ ట్రంప్

ప్రతి అమెరికన్‌కు తగినంత కోవిడ్ వ్యాక్సిన్ : డోనాల్డ్ ట్రంప్
x
Highlights

ప్రతి అమెరికన్‌కు తగినంత కోవిడ్ వ్యాక్సిన్ : డోనాల్డ్ ట్రంప్ నీసం 100 మిలియన్ మోతాదులను తయారు చేస్తామని చెప్పారు ట్రంప్. చాలా మంది ప్రజలు అనుకున్నదానికంటే పంపిణీ కూడా వేగంగా జరుగుతుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు..

వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి "ప్రతి అమెరికన్‌కు" తగినంత కోవిడ్ -19 వ్యాక్సిన్లు అందుబాటులోకి తెస్తామని, ఈ ఏడాది చివర్లో వ్యాక్సిన్ ఆమోదం పొందిన వెంటనే మొదటి మోతాదులను రోగులకు పంపిణీ చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చెప్పారు. ప్రస్తుతం వ్యాక్సిన్ ట్రయల్స్ చివరి దశలలో ఉన్నాయని.. ఈ ఏడాది చివరినాటికి కనీసం 100 మిలియన్ మోతాదులను తయారు చేస్తామని చెప్పారు ట్రంప్. చాలా మంది ప్రజలు అనుకున్నదానికంటే పంపిణీ కూడా వేగంగా జరుగుతుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. మెరుపు వేగంతో కరోనా వ్యాక్సిన్ తీసుకొస్తామని ఆయన ప్రతినబూనారు. మరోవైపు ట్రంప్ చేస్తున్న ప్రకటనలు తాను విశ్వసించడం లేదని.. డెమొక్రాటిక్ పార్టీ తరుఫున అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ఉన్న జో బిడెన్ అన్నారు.

వ్యాక్సిన్ పై ఆయన అనుమానం వ్యక్తం చేశారు.. రాజకీయ జోక్యం లేని వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని పెన్సిల్వేనియాలో ఓటర్లతో అన్నారు. ఇదిలావుంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. పాజిటివ్ కేసులు మూడు కోట్లు దాటాయి. మొదటిస్థానంలో అమెరికా ఉండగా రెండో స్థానంలో రెండవ స్థానంలో భారత్ ఉంది. ఈ తరుణంలో వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. దాదాపు 10కి పైగా వ్యాక్సిన్ లు ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్నాయి. అయితే అన్ని దేశాలు యూకెలోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పైనే నమ్మకాలూ పెట్టుకున్నాయి. అయితే ఇటీవల ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మళ్ళీ మూడురోజుల తరువాత ట్రయల్స్ మొదలు కావడంతో మళ్ళీ ఆశలు చిగురించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories