2024లో మళ్ళీ మీ ముందుకోస్తా : ట్రంప్

2024లో మళ్ళీ మీ ముందుకోస్తా : ట్రంప్
x
Highlights

ఈ నాలుగేళ్ళు గడిచాయి. మరో నాలుగేళ్ళు ప్రజలకు సేవ చేయాలనీ భావించాం. అందుకోసం ఎంతో శ్రమించాం. కానీ దురదృష్టవశాత్తూ ఓడిపోయాం. మరో నాలుగేళ్ళు తర్వాత మిమల్ని కలుసుకుంటాం

తానూ రాజకీయాల్లోనే కొనసాగుతానని అన్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. వైట్ హౌస్ లో నిర్వహించిన క్రిస్మస్ పార్టీలో పాల్గొన్న ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నాలుగేళ్ళు గడిచాయి. మరో నాలుగేళ్ళు ప్రజలకు సేవ చేయాలనీ భావించాం. అందుకోసం ఎంతో శ్రమించాం. కానీ దురదృష్టవశాత్తూ ఓడిపోయాం. మరో నాలుగేళ్ళు తర్వాత మిమల్ని కలుసుకుంటాం" అని అన్నారు ట్రంప్. అలాగే ట్విట్టర్‌ వేదికగా 'మోస్ట్‌ ఇంపార్టెంట్‌ వీడియో'అంటూ ఓ వీడియోని షేర్‌ చేశారు ట్రంప్.. ఈ వీడియోలో ఆయన దేశ ఎన్నికల వ్యవస్థ పూర్తిగా దాడికి గురయ్యిందని, ఎన్నో అవకతవకలు జరగుతున్నాయని వెల్లడించారు. అందుచేతే తానూ ఓడిపోయానని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్నో అవకతవకలు జరిగాయాని, దీనికి సంబంధించిన ఆధారాలున్నాయని అన్నారు ట్రంప్. ఇక ఇటివల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ బైడెన్ పైన ఓడిపోయినా సంగతి తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories