Donald Trump: మళ్ళీ ట్రంప్ కారు కూతలు.. భారత్-పాక్ యుద్ధం ఆపాడంట!

Donald Trump: "నేను హెచ్చరిస్తేనే యుద్ధం ఆగింది" - భారత్, పాక్ ఉద్రిక్తతలపై డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్!
Donald Trump: భారత్, పాకిస్తాన్ మధ్య 2025లో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలను తానే చొరవ తీసుకుని నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Donald Trump: భారత్, పాకిస్తాన్ మధ్య 2025లో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలను తానే చొరవ తీసుకుని నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్‌లో జరిగిన 'బోర్డ్ ఆఫ్ పీస్' కార్యక్రమంలో వెల్లడించారు. భారత్, పాక్ రెండూ యుద్ధానికి సిద్ధమైన నేపథ్యంలో తాను ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు. ఇరుదేశాలు యుద్ధం ఆపకపోతే ఉత్పత్తులపై 200 శాతం టారిఫ్‌లు విధిస్తానని, మీతో వ్యాపార సంబంధాలు తెంచుకుంటానని ఆసమయంలో ట్రంప్ హెచ్చరించినట్లు తెలిపారు. ఆర్థికపరమైన బెదిరింపులతోనే ఇరు దేశాలు యుద్ధం నుంచి వెనక్కి తగ్గాయని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే, ట్రంప్ వాదనలను భారత విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్‌తో ఎలాంటి మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని తాము అంగీకరించలేదని, కేవలం డీజీఎంవో స్థాయిలోనే చర్చలు జరిగాయని స్పష్టం చేసింది. 2025లో జరిగిన 'ఆపరేషన్ సింధూర్'లో ఏ ఒక్క భారత విమానం కూడా కూలలేదని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఎన్నికల స్టంట్ల కోసం ఇతర దేశాల ద్వైపాక్షిక విషయాల్లో కట్టుకథలు చెప్పడం సరికాదంటూ పరోక్షంగా చురకలు అంటించారు.
అదే సమయంలో బరాక్ ఒబామాపై ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఏలియన్లు నిజంగానే ఉన్నారంటూ ఇటీవల ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఒబామా అత్యంత రహస్యమైన వర్గీకృత సమాచారాన్ని బయటపెట్టారని ట్రంప్ ఆరోపించారు. అనంత విశ్వంలో ఎక్కడో ఒకచోట ఎలియన్లు ఉండి ఉంటారని తాను తెలిపానని ఒబామా వెల్లడించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



