అమెరికా కంపెనీలపై కొత్త వీసా రూల్స్ ప్రభావం

Arun Chilukuri
Published on: 24 Oct 2020 10:05 AM IST
అమెరికా కంపెనీలపై కొత్త వీసా రూల్స్ ప్రభావం
X

ట్రంప్ తెచ్చిన కొత్త వీసారూల్స్ ప్రభావం వందల మంది భారతీయులపై పడే అవకాశముందన్న హెచ్చరికలు ఇప్పటికే వినిపిస్తున్నాయ్. ఐతే ఈ డెసిషన్ వల్ల ఐటీ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లే అవకాశముందని అమెరికా సంస్థలు అంచనా వేస్తున్నాయ్. దాదాపు 7లక్షల కోట్లు నష్టపోయే అవకాశం ఉందని అంటున్నాయ్. డిసెంబర్‌ 31వరకు కొత్తగా హెచ్‌1బీ, ఎల్‌ 1 వీసాల ఆంక్షలపై తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై జూన్‌ 22న ట్రంప్‌ సంతకం చేశారు. ఐతే ఈ నిర్ణయం ఫార్చున్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఈ నష్టం విలువ భారీగా ఉంటుందని అమెరికాకు చెందిన బ్రోకింగ్స్‌ ఇనిస్టిట్యూట్‌ అనే సంస్థ అంచనా వేసింది.

వీసాల నిలిపివేత వల్ల దాదాపు 2లక్షల మంది విదేశీ నిపుణులు అమెరికా రాకుండా పోతారని ఈ నివేదికలో తెలిపారు. ట్రంప్‌ నిర్ణయం అమెరికా సంస్థలపై ప్రభావం చూపడమే కాకుండా కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం చేపడుతోన్న చర్యలు తాజా నిర్ణయంతో స్లో అవుతాయని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story