Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ ఆత్మాహుతి దాడి

*శుక్రవారం కావడంతో మసీదులో భారీగా జనం *ప్రార్ధనల సమయంలోనే ఆత్మాహుతి దాడి *కనీసం వంద మంది చనిపోయినట్లు వార్తలు

Shilpa
Published on: 8 Oct 2021 5:54 PM IST
Deadly Blast at Syed Abha Masjid in Afghanistan Kunduz City
X

కుందుజ్ సిటీలోని సయ్యద్ అబా మసీదుపై ఆత్మాహుతి దాడి(ఫైల్ ఫోటో)

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ ఆత్మాహుతి దాడితో దద్దరిల్లింది. కుందుజ్ సిటీలోని సయ్యద్ అబా మసీదుపై సూసైడ్ బాంబర్లు దాడి చేయడంతో కనీసం వంద మంది చనిపోయినట్లు సమాచారం. అసలే శుక్రవారం కావడంతో ప్రార్ధనల కోసం మసీదుకు పెద్ద సంఖ్యలో జనం పోటెత్తారు. అదే సమయంలో ఆత్మాహుతి దాడి జరగడంతో వంద మంది చనిపోయారని సమాచారం. మరో 200 మందికి గాయాలయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనాస్థలం ఛిద్రమైన శరీర భాగాలతో, రక్తపు మడుగులతో బీభత్సంగా కనిపిస్తోంది.

Shilpa

Shilpa

Next Story