
ఏడేళ్ల బాలుడికి భయపడుతున్న చైనా.. ఇంతకు ఆ బాలుడు ఎవరు?
Dalai Lama: ప్రపంచ శక్తిగా ఎదగాలని తహతహలాడుతోంది డ్రాగన్ కంట్రీ... ఎత్తులు, జిత్తులతో ఆర్థికంగా, రాజకీయంగా అగ్రదేశం అమెరికాకు షాకుల మీద షాకులు ఇస్తోంది.
Dalai Lama: ప్రపంచ శక్తిగా ఎదగాలని తహతహలాడుతోంది డ్రాగన్ కంట్రీ... ఎత్తులు, జిత్తులతో ఆర్థికంగా, రాజకీయంగా అగ్రదేశం అమెరికాకు షాకుల మీద షాకులు ఇస్తోంది. వివిధ దేశాల్లో తన పట్టు ఎంత ఉందో ప్రపంచానికి చాటుతోంది. ఇలాంటి సూపర్ పవర్ కంట్రీకి.. ఓ ఎనిమిదేళ్ల చిన్నోడు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడా చిన్నారి అంతర్జాతీయంగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఆ చిన్నోడి పేరేమిటి? అతడు ఎక్కడి వాడు? వంటి వివరాలు ప్రపంచానికి అంత పెద్దగా తెలియదు. కానీ.. డ్రాగన్ కంట్రీ మీద వణికిపోతోంది.. అంతర్జాతీయంగా ఆ బాలుడిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంతకు ఆ బాలుడు ఎవరు? ఎందుకు చైనా వణికిపోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే... ఈ స్టోరీని చూడాల్సిందే.
ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలుడి వయస్సు ఏడెదినిమిదేళ్లు ఉండొచ్చు.. వస్త్రాలను చుట్టుకుని ఉన్నాడు. ఆ చిన్నారిని ప్రస్తుత దలైలామా అభినందలు చెబుతున్నారు. ఈ ఫొటోగ్రాప్ బయటకు వచ్చిన వెంటనే అంతర్జాతీయంగా టిబెట్ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. టిబెటన్ బౌద్ద మత చరిత్రలోనే గొప్ప నిర్ణయం తీసుకున్నారా? టిబెటన్ సుప్రీం లీడర్ దలైలామా అతడేనా? దలైలామా తన వారుసుడిని గుర్తించారా? అంటూ చర్చ మొదలైంది. ఈ ఫొటోను టిబెట్ అధికారిక రాజధాని, హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఇటీవల తీసినట్టు తెలుస్తోంది. ఈ ఫొటో ఎప్పుడు తీసుకున్నారో కచ్చితమైన తేదీ తెలియదు. కానీ.. ఓ నివేదిక ప్రకారం.. మార్చి 8న ధర్మశాలలో నిర్వహించిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ ఫొటోను తీశారు. ఈ కార్యక్రమంలో 600 మంది మంగోలియన్ బౌద్ధ భిక్షువులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. దలైలామా అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో... స్వయంగా ఆయనే చిన్నారిని సత్కరించారు. ఆ బాలుడికి సింగింగ్ బౌల్‌ను వాయించడంలో దలైలామా సహకరించారు. అంతే కాకుండా ఆ చిన్నారిని మంగోలియా కొత్త రిమ్ పోచేగా పేర్కొన్నారు. రిమ్‌పోచే టిబెటన్ మూడో సీనియర్ దలైలామా.. టిబెటన్ బౌద్ధమత ఆధ్యాత్మిక నాయకుడు. రిమ్‌పోచేతో ఆ చిన్నారిని ప్రస్తుత దలైలామా పోల్చారు. గత 60 ఏళ్ల కాలంలో ఇలాంటి దృశ్యాలు ఎన్నడూ ధర్మశాల నుంచి బయటకు రాలేదు. దలైలామా వ్యాఖ్యలు... చిన్నారి పట్ల ఆయన వ్యవహరించిన తీరును చూస్తే... తదుపరి దలైలామా ఆ బాలుడే అన్న ప్రచారానికి ఊతమిచ్చింది.
ఈ బాలుడు మంగోలియాలో బౌద్ద విశ్వాసాలకు అధిపతి. ఇప్పటివరకు ఈ చిన్నారి ఉనికి గురించి పుకార్లు మాత్రమే ఉన్నాయి. అతడి ముఖాన్ని కూడా ఎవరూ చూడలేదు. కానీ.. ధర్మశాలలో జరిగిన ఈ వేడుకతో.. ఆ బాలుడిని దలైలామానే పరిచయం చేశారు. అసలు ఈ చిన్నారి ఎవరు? అంటే.. 2015లో అమెరికాలో ఆ చిన్నారి పుట్టినట్టు తెలుస్తోంది. ఆ బాలుడికి అమెరికా, మంగోలియా ద్వంద్వ పౌరసత్వం ఉంది. నిజానికి ఇద్దరు కవలల్లో ఒకరే ఈ చిన్నారి. ఇద్దరి పేర్లు అగుదాయ్, అషుతాయ్. అయితే ఈ ఇద్దరిలో ధర్మశాలకు వచ్చింది ఎవరో.. ఎవరికీ తెలియదు. ఈ చిన్నారి తండ్రి మంగోలియా నేషనల్ యూనివర్శిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. తల్లి వ్యాపారవేత్త. అతడి ఆ చిన్నారి అమ్మమ్మ మాజీ మంగోలియన్ పార్లమెంట్ మెంబరు. ఈ కుటుంబం మంగోలియాలో అతిపెద్ద బౌద్ధ ఆరామాల్లో ఒకదాన్ని నిర్వహిస్తోంది. 2016లో దలైలామా మంగోలియాను సందర్శించిన సందర్భంలో... కీలకమైన ప్రకటన చేశారు. పెద్ద ఎత్తున బౌద్ధులు హాజరైన సమావేశంలో... దలైలామా పునర్జన్మించినట్టు ప్రకటించారు. అప్పటి ప్రకటనతో చైనా టెన్షన్ పడింది. ప్రస్తుత లామా ప్రకటించిన ఆ చిన్నారి కోసం వేట మొదలు పెట్టింది. కానీ.. అప్పట్లో లామా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. లామా అప్పడు ప్రకటించింది ప్రస్తుత చిన్నారి గురించేనని స్పష్టంగా తెలుస్తోంది. ఈ చిన్నారే తదుపరి దలైలామానా? అతడే టిబెటన్ బుద్దిజం ఆధ్యాత్మక నాయకుడా? అన్న చర్చ మొదలైంది. అయితే ధర్మశాలలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో చిన్నారి గురించి దలైలామా ఎలాంటి ప్రకటన చేస్తారోనని మంగోలియాలో తీవ్ర ఆసక్తి నెలకొన్నది. చిన్నారిని రిమ్‌పోచేతో పోల్చడంతో మంగోలియాలో సంబరాలు జరుపుకున్నారు.
చిన్నారిని ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? దీనికి కారణం డ్రాగన్ కంట్రీ.. బాలుడి గురించి ప్రపంచానికి అంత పెద్దగా పరిచయం చేయలేదు. అందుకు స్పష్టమైన రాజకీయ చిక్కులు ఉన్నాయి. దలైలామా చైనా అధికారానికి సవాల్‌గా మారారు. నిజానికి టెబిట్ పూర్తిగా తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలని డ్రాగన్ భావిస్తోంది. అందుకే బౌద్దుల మత గురువు లామాను ఎన్నుకోవడంలో తమదే ఫైనల్ అంటూ చైనా చెబుతోంది. నిజానికి లామా ఎంపికపై చైనాకు ఎలాంటి నైతిక, చట్టపరమైన ఆధారాలు, అధికారాలు లేవు. టిబెట్ తన నియంత్రణలో ఉండాలంటే.. తాము ఆడినట్టు ఆడే లామా ఉండాలి. టిబెటన్ల నాయకుడు దలైలామానే.. టిబెటన్లు లామానే తమ పాలకుడిగా, దైవంగా భావిస్తారు. లామ ఎంత చెబితే అంత.. అందుకే లామాను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చైనా యోచిస్తోంది. టిబెట్‌ను ఎందుకు కంట్రోల్‌లో ఉంచుకుంటుంది? అంటే.. ప్రధాన నదులన్నీ టిబెట్ నుంచే ప్రవహిస్తాయి. అవి చైనాకు అత్యంత ముఖ్యమైనవి.. టెబిట్ పట్టు జారితే.. ఆ నదులపై ఆధిపత్యం పోతుంది. ఇక బీజింగ్‌కు విరుద్ధంగా ప్రస్తుత దలైలామానే.. తదుపరి బౌద్ద గురువును ఎంచుకున్నారు. దీంతో చైనాలో కలవరం మొదలైంది. తాజాగా మంగోలియన్ బాలుడిని రిమ్‌పోచేగా దలైలామా ప్రకటించడాన్ని జీర్ణిచుకోలేకపోతోంది. చైనాతో మంగోలియా సరిహద్దును పంచుకుంటోంది. లామా విషయంలో గతంలోనే మంగోలియాను డ్రాగన్ కంట్రీ లక్ష్యంగా చేసుకుంది. 2016లో మంగోలియాను దలైలామా పలుమార్లు సందర్శించారు. దీంతో మంగోలియాపై డ్రాగన్ కక్ష్య సాధింపు చర్యలకు దిగింది. దౌత్యపరమైన చర్చలను రద్దు చేసింది. రుణాలను నిలిపేసింది. మంగోలియా సరిహద్దులను మూసేసింది. మంగోలియాపై రాజకీయ, ఆర్థిక ఒత్తిడిని పెంచింది. దీంతో మంగోలియన్లు దిగి వచ్చారు. మరోసారి దలైలామాకు ఆతిథ్యం ఇవ్వమంటూ హామీ ఇచ్చారు. దలైలామా మంగోలియాను చివరిగా 2016 నవంబరులో సందర్శించారు. అప్పట్లో జెట్‌సున్ దంపా పునర్జన్మించినట్టు ప్రకటించారు. జెట్‌సున్ దంపా తొలి బౌద్ద గురువు.. దలైలామా ప్రకటించిన నాటి నుంచి అతడి కోసం చైనా వేట మొదలు పెట్టింది.
ఏడేళ్ల తరువాత దలైలామా అధికారికంగా చిన్నారిని సన్మానించారు. దీనిపై మంగోలియా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బహుశా చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తుందనే భయంతోనే.. మంగోలియా ప్రభుత్వం మౌనంగా ఉండొచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఏదేమైనా.. ఈ విషయంలో అన్ని పక్షాలు మౌనంగా ఉండడమే సరైనది తెలుస్తోంది. ఎందుకంటే.. చైనా ఎలాంటి దారుణాలకు ఒడిగడుతుందో ప్రపంచానికి తెలుసు. 1995లో జరిగిన ఉదంతమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. అప్పట్లో కొత్త దలైలామాగా ఓ చిన్నారిని పంచెన్ లామా ప్రకటించారు. పంచెన్‌లామా అంటే.. బౌద్దుల రెండో ప్రముఖ ఆధ్యాత్మిక నేత. అతడే పునర్జన్మించాడని అప్పట్లో దలైలామా ప్రకటించారు. ఆ బాలుడి గురించి ప్రపంచానికి తెలియజేశారు. ఆ చిన్నారిని డ్రాగన్ కంట్రీ ఏం చేసిందో తెలుసా?.. అరెస్టు చేసింది. అవును... చిన్నారినే అరెస్టు చేసింది. ఆ తరువాత.. తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని పంచెన్ లామాగా ప్రకటించింది. దీన్ని అప్పట్లో టిబెటన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తరువాత.. ఒరిజినల్ పంచెన్‌లామా ఏమెయ్యారో ఎవరికీ తెలియదు. అందుకే ఈసారి చైనా ఎత్తులు పారకుండా దలాలైమా, బౌద్ధ భిక్షువులు ముందుజాగ్రత్తలు పాటించారు. అందుకే చిన్నారి వివరాలను బయటకు వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు. దలైలామా వారసుడిని ఎంపికయ్యారని.. కానీ.. అతడి గురించి ఏ మాత్రం చెప్పలేదు. అయితే తాజా పరిణామాలపై డ్రాగన్ కంట్రీ ఎలా స్పందిస్తుంది?
తాజా పరిణామాలపై చైనా ఇప్పటివరకు స్పందించలేదు. కానీ.. బీజింగ్ ఈ విషయాన్ని నిశితంగా ట్రాక్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దలైలామా కదలికలపై కన్నేసింది. ఎందుకంటే.. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ద రాజకీయ ప్రవాసి దలైలామా.. 1960 నుంచి భారత్ నుంచే టిబెట్‌ను పాలిస్తున్నాడు. దీన్ని బీజింగ్ ఏ మాత్రం సహించడం లేదు. టిబెట్‌లోని బౌద్ధ మతాన్ని చైనా నియంత్రించాలనుకుంటోంది. కానీ.. దలైలామా జీవించి ఉన్నంత కాలం అది సాధ్యం కాకపోవచ్చు. టిబెట్‌లో దలైలామాపై తిరుగులేని విశ్వాసం ఉంది. దీంతో దలైలామా ఎలాంటి అడుగులు వేస్తారో వేచి చూడాలని డ్రాగన్ కంట్రీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దలైలామా వారసత్వ ప్రణాళికలను నియంత్రించాలని యత్నిస్తోంది. కానీ.. చైనా ఆట కట్టించే ప్రణాళికలు దలైలామా వద్ద ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి నుంచే తదుపరి దలైలామాను గుర్తించి... భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మంగోలియా నుంచి వచ్చిన బాలుడు దలైలామా వారసుడు అవొచ్చు.. కాకపోవచ్చు. కానీ.. అతడికి నామినేషన్‌కు మాత్రం మార్గం సుగమం చేశారు. అయితే దలైలామా తన వారసుడి పేరును చెబుతారా? అంటే.. ఆయన వయస్సు 90 ఏళ్లకు చేరుకోగానే వారసుడిని ప్రకటిస్తారు. ప్రస్తుత దలైలామా వయస్సు 87 ఏళ్లు. అంటే.. కొత్త దలైలామా గురించి తెలియాలంటే మరో మూడేళ్లు ఆగాల్సిందేనన్నమాట.
స్వేచ్ఛాయుత దేశంలో.. తన వారుసుడు టిబెట్ బాధ్యతలను పొందాలని గతంలో దలైలామా చెప్పారు. స్వేచ్చాయుత దేశమంటే మరేదో కాదు.. భారత దేశమే. భారతదేశంలో టిబెట్ బాధ్యతలు చేపట్టడమేమిటంటే.. 1959 నుంచి టిబెట్ ఆధునిక రాజధాని ధర్మశాలనే. దలైలామా చైనాను వీడి వచ్చిన తరువాత.. ఆయన వెంట వేలాది మంది అనుచరులు వచ్చారు. వారికి భారత్ ఆశ్రయం కల్పించింది. అప్పట్లో దలైలామాపై చైనా తాత్కాలికంగా బహిష్కరణ ఉంటుందని భావించారు. కానీ.. చైనా చర్యలు మరింత తీవ్రమయ్యాయి. టిబెట్, టిబెటన్లపై డ్రాగన్ కంట్రీ పూర్తిగా పట్టు బిగించింది. ఇప్పుడు తదుపరి దలైలామాపైనా కన్నేసింది. నెక్ట్స్ టిబెటన్ సూపర్ లీడర్ ఎంపిక గేమ్ టెన్షన్ పుట్టిస్తోంది. టిబెటన్లు తమ నాయకుడిని ఎన్నుకునేలా చేయడంలో భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోంది. దలైలామా ఎంపిక అంత సులభం కాదు కానీ.. ఇదే సరైన సమయని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



