Spain: లాక్ డౌన్ ఎత్తివేసిన స్పెయిన్

Covid-19 Spain People Celebrate the end of Lockdown
x

స్పెయిన్ లో లాక్ డౌన్ ఎత్తివేశారు 

Highlights

Spain: స్పెయిన్ లో శనివారం అర్థరాత్రి యువతీ యువకులు ముద్దుల పెట్టుకుంటూ వీధుల్లో డాన్సులు చేశారు.

Spain: గత సంవత్సరం చైనాలో ప్రారంభమైన కోవిడ్ -19 ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. అయితే అప్పటి నుండి లాక్ డౌన్ కొనసాగించిన న్యూజీలాండ్, ఫిజీ లాంటి కొన్ని దేశాలు తాము కరోనా వైరస్ నుంచి విముక్తి పొందామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో స్పెయిన్ లో శనివారం అర్థరాత్రి పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ముఖ్యంగా యువతీ యువకులు వారిలో ఉన్నారు. వీధుల్లో డాన్సులు చేశారు. ముద్దులు పెట్టుకున్నారు. సరిగ్గా అర్థరాత్రి 12 దాటాక కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నట్లుగా గో కరోనా వేడుకలు జరుపుకున్నారు. ఇదంతా కరోనా పోయినందుకు కాదు... ఆరు నెలలుగా అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఎత్తివేసినందుకు. కరోనా కేసులు తగ్గిపోవడంతో... ఇక లాక్‌డౌన్ అవసరం లేదనుకున్న ప్రభుత్వం ఆదివారం నుంచి ఎత్తివేసింది. మరో వైపు ఇండియాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రపంచంలో రోజూ వస్తున్న కొత్త కేసుల్లో సగం ఇండియావే ఉండటం గమనార్హం.

స్పెయిన్‌లో ప్రజలు ఈ వేడుకలు జరుపుకునేందుకు పూర్తిగా అర్హులే అనుకోవచ్చు. ఎందుకంటే... 2020 నుంచి అక్కడ లాక్‌డౌన్ ఉంది. అది కఠినంగా అమలైంది. ఇళ్లలోంచి బయటకు వస్తే ఊరుకునేవారు కాదు. కనీసం పక్కింటికి వెళ్లే ఛాన్స్ కూడా లేదు. అంత కఠినంగా అమలుచేశారు. ఇప్పడు లాక్‌డౌన్ ఎత్తేశారు కాబట్టి... అక్కడ ప్రజలు... రోడ్లపై తిరగవచ్చు. ఇతర ప్రాంతాలకు ట్రావెల్ చెయ్యవచ్చు.

శనివారం స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని సెంట్రల్ ప్యూర్టా డెల్ సోల్ స్క్వేర్ దగ్గర ప్రజలు పెద్ద సంఖ్యలో చేరి... మాస్కులు లేకుండా ఎంజాయ్ చేశారు. ఐతే... ఇలాంటి వేడుకలు జరుపుకోవద్దని ప్రభుత్వం ముందే చెప్పింది. అయినా వాళ్లు వినలేదు. ఇలాగే ఊరుకుంటే... మళ్లీ కరోనా పెరగవచ్చని భావించిన పోలీసు అధికారులు... యువతను పంపించేసేందుకు నానా తిప్పలు పడ్డారు. అక్కడే కాదు దేశంలోని చాలా చోట్ల ఇలాంటి వేడుకలు జరిగాయి. స్పెయిన్ బీచులకు కూడా రాత్రివేళ వెళ్లి ఎంజాయ్ చేశారు.

ఇక స్పెయిన్‌లో రెస్టారెంట్లు, బార్లు రాత్రి 11 వరకూ తెరిచే ఉంటాయి. ఒక్కో టేబుల్‌కి నలుగురు కూర్చోవచ్చు. ప్రస్తుతం స్పెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు అంటే... బాలెరిక్ ఐలాండ్స్, కానరీ ఐలాండ్స్, నవర్రా, వాలెన్సియాలో మాత్రమే కర్ఫ్యూ అమల్లో ఉంది.దేశంలోని 17 ప్రాంతాల్లో కరోనా రూల్స్ ఎత్తేశారు. అక్కడ కొత్తగా రోజూ 4వేల దాకా కొత్త కేసులు వస్తున్నాయి. వాటి సంఖ్య అంతకన్నా పెరగట్లేదు. దాంతో ఇక పెరగవులే అనుకున్న ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తేసింది. మరోవైపు వ్యాక్సినేషన్ డ్రైవ్ కొన్ని వారాలుగా జోరుగా సాగుతోంది

న్యూజీలాండ్ గత వారం కరోనా నుంచి విముక్తి పొందినట్లు స్వయంగా ప్రకటించింది. అయితే 24 రోజుల తర్వాత ఈ కొత్త పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు న్యూజీలాండ్ ఆరోగ్య శాఖ కొత్తగా రెండు పాజిటివ్ కేసులు ధ్రువీకరించారని చెప్పింది. వారిద్దరూ బ్రిటన్ నుంచి తిరిగి వచ్చారని, ఇద్దరూ ఒకరికొకరు తెలిసినవారే అన చెప్పింది. దేశంలో లాక్‌డౌన్ ఆంక్షలన్నీ ఎత్తివేసినప్పటికీ అంతర్జాతీయ విమాన సేవలపై ఇప్పటికీ నిషేధం కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories