ప్రపంచంలో మరో కొత్త వేరియంట్‌.. డెల్టాక్రాన్‌గా నామకరణం.. లక్షణాలు ఇవే...

Corona New Variant - Deltacron: సైప్రస్‌లో వేరియంట్‌ను గుర్తించిన వైద్యులు...

Shireesha
Updated on: 11 Jan 2022 8:00 AM IST
Coronavirus New Variant Deltacron Found in Cyprus Symptoms Like Delta Variant and Omicron | Covid Latest News
X

ప్రపంచంలో మరో కొత్త వేరియంట్‌.. డెల్టాక్రాన్‌గా నామకరణం.. లక్షణాలు ఇవే...

Corona New Variant - Deltacron: కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌తో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతుంటే మరొకవైపు కొత్త వేరియంట్‌ వెలుగుచూసింది. సైప్రస్‌లో ఈ వేరియంట్‌ను గుర్తించారు. దీనికి "డెల్టాక్రాన్‌" అని పేరు పెట్టారు. ఇందులో డెల్టా వేరియంట్‌ లక్షణాలు, ఒమిక్రాన్‌ లక్షణాలు ఉండటంతో ప్రస్తుతానికి డెల్టాక్రాన్‌గా పేరుపెట్టారు. అయితే.. కొత్త రకం వేరియంట్‌ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు డెల్టాక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం ఎంతో ఉంటుందో ఇప్పుడే చెప్పాలేమని మరికొందరు అంటున్నారు. సైప్రస్‌లో సేకరించిన నమూనాల్లో ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్లకు సంబంధించిన 10 మ్యూటేషన్లు గుర్తించినట్లు తెలుస్తోంది. కరోనా చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన బాధితుల నుంచి కొన్ని నమూనాలు, సాధారణ జనం నుంచి కొన్ని నమూనాలు సేకరించిన తర్వాత దీన్ని కనుగొన్నారు.

Shireesha

Shireesha

Next Story