న్యూ ఇయర్ వేడుకలు ఈసారి ఉండవా?

న్యూ ఇయర్ వేడుకలు ఈసారి ఉండవా?
x
Highlights

కొత్త సంవత్సరం వస్తుందంటే ఆ జోషే వేరు యువత ఉరిమే ఉత్సహాంతో న్యూ ఇయర్‌కు వెల్ కం చెబుతోంది. కుర్రకారు జోష్ మాత్రం మాములుగా ఉండదు. వారి ఆనందానికి...

కొత్త సంవత్సరం వస్తుందంటే ఆ జోషే వేరు యువత ఉరిమే ఉత్సహాంతో న్యూ ఇయర్‌కు వెల్ కం చెబుతోంది. కుర్రకారు జోష్ మాత్రం మాములుగా ఉండదు. వారి ఆనందానికి అవధుల్లేకుండా ఉంటుంది. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు కానీ, గతేడాది నుంచి పరిస్థితి మారిపోయింది. కరోనా వైరస్ వల్ల ఏటు వెళ్లలేం వెళ్లినా మాస్క్ పెట్టుకుని చేతిలో శానిటైజర్ పట్టుకొని ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

2020 ఏడాది అంతా కోవిడ్‌తోనే కాలం గడిచింది. వ్యాక్సిన్ కోసం దేశాలన్నీ పోటీ పడుతున్నాయి. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. మరికొన్ని దేశాల్లో ట్రయల్స్ దశలోనే వ్యాక్సిన్ ఉంది. కరోనా విరుగుడు రావడానికి ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి రెండో దశ ప్రారంభమైంది. మొదటి దశ కంటే రెండో దశనే ఎక్కువ ప్రమాదకరంగా మారిందని వైద్యులు అంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం చూపిస్తుండడంతో వచ్చే 2021 కొత్త సంవత్సర వేడుకలు వద్దంటూ కొన్ని దేశాలు నిషేదాలు విధిస్తున్నాయి. ఇప్పట్లో వేడుకలకు అనుమతిచ్చి ఎందుకు కోరి ప్రమాదాన్ని ఎంచుకుందామని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కోవిడ్ సాంకేతిక సలహా సమితి సిఫార్సుల మేరకు క్రిస్‌మస్, న్యూ ఇయర్‌‌కు పలు ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్స్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించనున్నాయి శీతాకాలం కావడం, గాలిలో కాలుష్యం పెరిగిన నేపథ్యంలో కేసులు మరింతగా పెరిగే అవకాశలున్నాయని వైద్యులు చెప్తున్నారు. హిమచల్ ప్రదేశ్‌లోని సివిలా, కులు, కాంగ్రా, మండి జిల్లాలో బహిరంగ నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నాలుగు జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూను ప్రభుత్వం జనవరి 5వ తేదీ వరకు పొడగించింది.

మరోవైపు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోనూ కర్ఫ్యూ అమల్లో ఉంది. డిసెంబర్ 31 రోజున పార్టీలు ఉండవని తెలుస్తోంది. ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ ఉండడంతో డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకలను నిషేధించింది. రాత్రి 9 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలు ఉండవని ప్రకటించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.

మరోవైపు జర్మనీ మాత్రం లాక్‌డైన్ విధించింది. డిసెంబర్ 16 నుంచి జనవరి 10వరకు లాక్‌డౌన్ విధించింది. రాబోయే క్రిస్మస్‌ను దృష్టిలో ఉంచుకుని కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు జర్మనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories