Coronavirus: జీ-7ను టార్గెట్ చేస్తూ డ్రాగన్ కంట్రీ వార్నింగ్ కామెంట్స్

China Slams G7 Summit
x

Coronavirus: జీ-7ను టార్గెట్ చేస్తూ డ్రాగన్ కంట్రీ వార్నింగ్ కామెంట్స్

Highlights

Coronavirus: కరోనా మహమ్మారి ఊహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందా..? జీ-7 సదస్సు సాక్షిగా డ్రాగన్ కంట్రీ వ్యవహార శైలి ఇదే అంశాన్ని సూచిస్తుందా..?

Coronavirus: కరోనా మహమ్మారి ఊహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందా..? జీ-7 సదస్సు సాక్షిగా డ్రాగన్ కంట్రీ వ్యవహార శైలి ఇదే అంశాన్ని సూచిస్తుందా..? కరోనా మూలాలు కనిపెట్టాల్సిందే అంటున్న జీ-7 సమ్మిట్‌పై డ్రాగన్ ఎందుకు విరుచుకుపడుతుంది..?

క‌రోనా పుట్టుక‌పై పూర్తి స్థాయి విచార‌ణ జ‌రిపాలని ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో డ్రాగన్ కంట్రీ తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోంది. ఏకంగా జీ-7 దేశాలను టార్గెట్ చేస్తూ వార్నింగ్ కామెంట్స్ చేసింది. చిన్న కూటములు కలిసి ప్రపంచాన్ని శాసించే కాలం ఎప్పుడో చెల్లిందని హెచ్చరించింది. చైనా కట్టడిచేయడంపై జీ-7 సదస్సులో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపధ్యంలో డ్రాగన్ కంట్రీ కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారింది.

జీ-7 సమావేశం సాక్షిగా అమెరికా కామెంట్స్ చైనాను చికాకు పెట్టాయి. భవిష్యత్తులో డ్రాగన్ నుంచి ఎదురయ్యే ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అమెరికా పిలుపునిచ్చింది. ఈ నిర్ణయంపై తీవ్రంగా మండిపడిన చైనా చిన్న చిన్న కూటములతో భయపెట్టే రోజులు పోయాయని, ప్రపంచంలోని అన్ని దేశాలతో సంప్రదించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలంది. నిజానికి కరోనా పుట్టింది ఊహాన్‌లో కాకుంటే డ్రాగన్‌‌కు ఎందుకంత ఉలుకు? ఇప్పుడివే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరోవైపు జీ-7 సమావేశంలో WHO చీఫ్ టెడ్రోస్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ వైరస్‌పై మరోసారి నిర్వహించే సమగ్ర విచారణకు సహకరించాలన్నారు. వైరల్ మూలాల గురించి తెలుసుకునేందుకు చైనా పారదర్శకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై మరోసారి అధ్యయనాన్ని ప్రారంభించ‌డానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు టెడ్రోస్ వివ‌రించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories