పాకిస్తాన్ లో అంతకంతకూ పెరుగుతోన్న కరోనా..

పాకిస్తాన్ లో అంతకంతకూ పెరుగుతోన్న కరోనా..
x
Highlights

పాకిస్తాన్లో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది.. సోమవారం 326 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

పాకిస్తాన్లో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది.. సోమవారం 326 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దాంతో మొత్తం కేసుల సంఖ్య 3161 కి చేరుకుంది.. ఇందులో మరణించిన వారిలో 47 మంది ఉన్నారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ 'కోవిడ్ -19' కు ఎక్కువగా ప్రభావితమైంది. ఇక్కడ 1380 మంది సోకింది. అంతేకాదు ఇక్కడ వైరస్ భారిన పడి 12 మంది మరణించారు. ఇక సింధ్ ప్రావిన్స్‌లో కరోనా మహమ్మారి ద్వారా 15 మంది మరణించారు.. ఇక్కడ 881 మందికి సోకింది.

ఖైబర్ పఖ్తున్ఖ్వాలో 372 మంది కరోనా బాధితులు ఉండగా.. ఇక్కడ 16 మంది మరణించారు. బలూచిస్తాన్‌లో 192 మందికి వైరస్ సోకింది.. అందులో ఒకరు మరణించారు. గిల్గిట్ బాల్టిస్తాన్లో 210 మంది సోకింది.. ఇందులో మూడు మరణాలు ఉన్నాయి. రాజధాని ఇస్లామాబాద్‌లో 78 మంది, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో 18 మంది కరోనా రోగులు ఉన్నారు.

ఇదిలావుంటే కరోనాకు వ్యతిరేకంగా మీడియా సహాయంతో భారీగా ప్రజల్లో అవగాహన ప్రచారం జరుగుతోందని పాక్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. విమానాశ్రయాలలో దిగ్బంధం కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయని పేర్కొంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories