కరోనా వాక్సిన్ రెడీ చేసిన చైనా.. విదేశాల్లో ట్రయిల్స్

కరోనా వాక్సిన్ రెడీ చేసిన చైనా.. విదేశాల్లో ట్రయిల్స్
x
Highlights

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తుంది. చైనాలోని వూహన్ లో వెలుగు చూసిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటిదాకా 8,58,669 మందికి సోకింది.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తుంది. చైనా లోని వూహన్ లో వెలుగు చూసిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటిదాకా 8,58,669 మందికి సోకింది. ఈ మహమ్మారి కరోనా బారినపడి 42,326 మరణించారు. కరోనా వైరస్ చైనా ప్రజలను రెండు నెలలు వణికించింది. తాజాగా పాజిటివ్ కేసులు తగ్గడంతో పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చాయి.

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు చైనా సిద్దం చేస్తున్న వ్యాక్సిన్‌కు విదేశాల్లో ట్రయిల్స్ నిర్వహించాలని ఆ దేశం ఆలోచిస్తోంది. ప్రస్తుతం వుహన్ నగరంలో ఈ కొవిడ్ వ్యాక్సిన్‌ పై పరీక్షలు నిర్వహిస్తుండగా అవి విజయవంతం అయితే విదేశాల్లో కూడా వాక్సిన్ ట్రయిల్స్ చేసేందుకు చైనా యోచిస్తున్నట్లు నిపుణులు అంటున్నారు. చైనాలో నివసించే విదేశీయులపై కూడా ఈ వాక్సిన్ ప్రయోగిస్తామని చెన్ వీ అన్నారు.

చైనా ప్రభుత్వం అనుమతితో వుహన్ లో మార్చి 16న ఈ వ్యాక్సిన్‌కు తొలిదశ ట్రయిల్స్ ను మొదలుపెట్టారు. ఈ వ్యాక్సిన్ ప్రయోగం సురక్షితంగా, విజయవంతంగా సాగుతోందని, దీని ఫలితాలు ఏప్రిల్‌లో విడుదల చేస్తామని చైనీస్ అకాడమీ అఫ్ ఇంజనీరింగ్ సభ్యుడు చెన్ వీ తెలిపారు.

చైనాలో వ్యాక్సిన్ ప్రారంభ ఫలితాల్లో మంచి ప్రభావాన్ని చూపించింది. అంతర్జాతీయ దేశాల సాయంతో విదేశాల్లో కూడా దీనిపై ట్రయిల్స్ నిర్వహిస్తామని చెన్ లి తెలిపినట్లు అక్కడి ప్రభుత్వ పత్రిక తెలియజేశారు. ఈ వ్యాక్సిన్ కరోనా ప్రభావిత దేశాల్లోను వాడవచ్చని చెన్ అన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అంతర్జాతీయ దేశాలకు సహకరించేందుకు తాను, తమ బృందం ఎలప్పుడూ సిద్దంగా ఉన్నామని లి వెల్లడించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories