China Lockdown: మరోసారి లాక్ డౌన్ విధించిన చైనా ప్రభుత్వం

China Lockdown: డ్రాగన్ కంట్రీలో మరోసారి కరోనా కలకలం

Jyothi
Updated on: 6 Sept 2022 10:00 PM IST
Corona Virus Once Again in the Dragon Country
X

China Lockdown: మరోసారి లాక్ డౌన్ విధించిన చైనా ప్రభుత్వం

China Lockdown: చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అక్కడ మళ్లీ లాక్ డౌన్ విధించారు. 70 నగరాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు గుర్తించిన చైనా అధికారులు.. కరోనా ఆంక్షలు మరింత కఠినతరం చేస్తున్నారు. ప్రజలను కనీసం బయటకు కూడా రానివ్వకుండా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా చైనాలో 30 సిటీల్లో ప్ర‌భుత్వం కోవిడ్ ఆంక్ష‌లు విధించినట్లు అక్క‌డికి మీడియా సంస్థ‌లు తెలిపాయి. అయితే ఈ లాక్‎డౌన్ ఎంత కాలం పాటు ఉంటుంద‌నే విష‌యంలో అక్క‌డి ప్ర‌భుత్వం క్లారిటీ ఇవ్వ‌లేదు. విద్యార్థులు కూడా ఆన్ లైన్ క్లాసుల ద్వారా పాఠాలు వింటున్నారు. త్వ‌ర‌లో చైనాలో స్కూల్స్ కు సెల‌వులు రానున్నాయి.

Jyothi

Jyothi

Next Story