Coronavirus: జర్మనీలో విజృంభిస్తున్న కోవిడ్ మహమ్మారి

Coronavirus: గత వారంగా విపరీతంగా పెరుగుతున్న కేసులు

Sandeep Eggoju
Published on: 10 Nov 2021 9:03 PM IST
Corona Cases Increasing in Germany
X

representational Image

Coronavirus: జర్మనీలో కోవిడ్ కల్లోలం కంటిన్యూ అవుతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో దాదాపు 40వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా జర్మనీలో కోవిడ్ ఇన్ఫెక్షన్ రేటు ప్రతి లక్ష మందికి 232.1కి చేరింది. తాజా పరిస్థితులతో జర్మనీలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయకుంటే మరోసారి లాక్‌డౌన్ తప్పవని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

మరోవైపు.. పెరుగుతున్న కేసులతో జర్మనీలో ఆసుపత్రులు, ఐసీయూల్లోకి చేరే కొవిడ్‌ రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. బాధితులతో ఐసీయూలు నిండిపోయాయని, కొత్త రోగులను చేర్చుకునే పరిస్థితులు లేవని ఆసుపత్రులు పేర్కొంటున్నాయి. సిబ్బంది మొత్తం కొవిడ్‌ బాధితులనే పర్యవేక్షిస్తుండటంతో పలు సర్జరీలను నిలిపివేయాల్సి వచ్చిందని బెర్లిన్‌లోని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే వైద్యాధికారులు, నిపుణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంటున్నారు. వైరస్ ఉద్ధృతిని కట్టడిచేసేందుకు కఠిన నిర్ణయాలు అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే. జర్మనీలో లాక్‌డౌన్‌ విధించే అవకాశం లేదని పదేపదే ప్రకటిస్తున్న అధికారులు ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని కోరుతున్నారు. టీకా వేసుకోనివారిలోనే ఎక్కువగా కరోనా కేసులు వెలుగుచూస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో జర్మనీ జనాభా 8.30 కోట్లు కాగా వీరిలో 67 శాతం మంది పూర్తిస్థాయిలో టీకాలు వేసుకున్నారు. ఇప్పటివరకు జర్మనీలో కరోనా కారణంగా 96వేల 963 మంది ప్రాణాలు కోల్పోయారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story