ప్రపంచం అల్లాడుతున్నా తీరు మారని చైనా

ప్రపంచం అల్లాడుతున్నా తీరు మారని చైనా
x
Highlights

ప్రపంచం కరోనా వైరస్ తో అల్లాడుతున్నా నా దారి నాదే అంటోంది చైనా. మూడు నెలల క్రితం కరోనా ఊచకోతకు దారుణంగా బలైనా ఆదేశం తీరు కొంచమైనా మారలేదు. ఓవైపు వైరస్...

ప్రపంచం కరోనా వైరస్ తో అల్లాడుతున్నా నా దారి నాదే అంటోంది చైనా. మూడు నెలల క్రితం కరోనా ఊచకోతకు దారుణంగా బలైనా ఆదేశం తీరు కొంచమైనా మారలేదు. ఓవైపు వైరస్ ఉథృతి తగ్గక ప్రపంచదేశాలు అల్లాడుతుంటే చైనా మాత్రం నాతిండి నాదేనంటోంది.

చైనా మళ్లీ పాత పద్ధతిలోకి వచ్చేసింది తన విచిత్రమైన ఆహారపు అలవాట్లతో కరోనా వైరస్ పెచ్చరిల్లడానికి కారణమైన చైనా మిగతా ప్రపంచం ఆ ముప్పు నుంచి ఇంకా కోలుకోకుండానే మళ్లీ తన పాత రూట్ కి వచ్చేసింది. చైనా ఫుడ్ మార్కెట్ లో గబ్బిలం వంటకాలు దర్శనమిస్తున్నాయి. వుహాన్ నగరంలో కరోనా వైరస్ పెద్ద పెట్టున విస్తరించి ప్రపంచం మొత్తాన్ని చుట్టేయడానికి గబ్బిలాల వంటకాలే కారణమన్న వాదనలు వినిపించాయి. కరోనా వైరస్ గబ్బిలాల్లోనే ఉంటుందని శాస్త్రీయంగా నిరూపితమైంది కూడా గబ్బిలాల వంటకాల ద్వారానే ఈ వైరస్ విస్తరించిందని మూడు నెలల క్రితం వరకూ వార్తలొచ్చాయి. కరోనావిశ్వరూపం దాల్చడంతో సీఫుడ్ తోపాటూ ఇలాంటి జంతు సంబంధిత వంటకాలన్నింటికీ కొన్నాళ్ల పాటూ ఆ దేశం విరామమిచ్చింది. అయితే తాజాగా వైరస్ తగ్గిపోయిందని ప్రకటించింది. వుహాన్ లో చిట్ట చివరి ఐసోలేషన్ వార్డునూ తీసేశామని గర్వంగా చెప్పుకుంది. కానీ అక్కడ కొత్తగా 47కేసులు వెలుగు చూశాయన్నది ఇవాల్టి వార్తల సారాంశం చైనాలోకరోనా మృతుల విషయంలో అంకెలు తారుమారు చేసిందని, వాస్తవానికి ఆ దేశం బయటకు చెబుతున్న లెక్కలకూ చాలా తేడా ఉందని ఇతర దేశాలనుంచి కామెంట్స్ కూడా వచ్చాయి.

చైనాలో 82,342 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 3000 మందికి పైగా మరణించారు. మహమ్మారి వైరస్‌ వేలాది మంది ప్రాణాలను హరించినా చైనా ఆహారపు అలవాట్లు, అక్కడి ఆహార మార్కెట్లలో అపరిశుభ్రత రాజ్యమేలడం ఆందోళన రేకెత్తిస్తోంది. చైనాలో పుట్టిన మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నా అపరిశుభ్ర వాతావరణంలోనే అక్కడి ఆహార మార్కెట్లలో పిల్లులు, కుక్కలు, గబ్బిలాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. చైనా ఆహార మార్కెట్లలో కబేళాలకు సిద్ధమైన మూగ జీవాలు వేలాడుతూ అదే అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతోంది. గబ్బిలాలు, ఇతర మూగజీవాల ద్వారా ఈ మహమ్మారి మానవులకు వ్యాపించిందన్న సమాచారంతో ఈ ఏడాది జనవరిలో ఆహార మార్కెట్లను మూసివేశారు. ఇక ఈ వైరస్‌ను విజయవంతంగా నిరోధించగలిగామని చైనా ప్రకటించిన క్రమంలో మార్కెట్లు మళ్లీ మొదలయ్యాయి. అయితే చైనా ఫుడ్‌ మార్కెట్లలో తిరిగి అపరిశుభ్ర వాతావరణంలో మూగజీవాల విక్రయం ఆందోళన కలిగిస్తోంది. కరోనావైరస్‌కు ముందున్న స్ధితిలోనే మార్కెట్లు తిరిగి పనిచేస్తున్నాయని అక్కడి ప్రసార మాధ్యమాల వార్తలు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి పై ప్రపంచం ఇంకా పోరాడుతుండగా ఆ విధ్వంసానికి కారణమైన చైనా మాత్రం మళ్లీ నోటికి పనిచెబుతోంది. చైనా ఇదేం తీరు?

Show Full Article
Print Article
More On
Next Story
More Stories