Coronavirus: మరణాల సంఖ్యను 50 శాతం పెంచిన చైనా!

Coronavirus: మరణాల సంఖ్యను 50 శాతం పెంచిన చైనా!
x
Highlights

కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న చైనాలోని వుహాన్ నగరంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న చైనాలోని వుహాన్ నగరంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. చైనా నగరమైన వుహాన్ లోని కరోనావైరస్ నుండి 3,869 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు, ఇది మునుపటి సంఖ్య కంటే 1,290 లేదా 50 శాతం పెరిగింది. దీంతో దేశవ్యాప్త మరణాల సంఖ్య 40శాతం పెరిగి 4,636కు చేరింది. అలాగే, వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిన సంఖ్యలో సైతం 325 కొత్త కేసులను కలిపింది.

అయితే దీనిపైన అక్కడి స్థానిక ప్రభుత్వం స్పందించింది. నగరంలో కరోనా వ్యాప్తి ప్రారంభ రోజుల్లో తప్పుగా లెక్కించడం జరిగిందని ఇది ఒక ప్రకటనలో అంగీకరించింది. ప్రైవేట్‌, తాత్కాలిక ఆస్పత్రుల నుంచి సమాచారాన్ని సేకరించడంలోనూ జాప్యం జరిగిందని, వ్యాప్తి ప్రారంభ దశలో ఆసుపత్రులు తట్టుకోలేక పోవడంతో కొంతమంది రోగులు ఇంట్లో మరణించారని వెల్లడించింది. ఇక వుహాన్‌లో మరణాల రేటు 7.7 శాతంగా ఉందని గ్లోబల్ టైమ్స్ తెలిపింది. చైనాలో కరోనావైరస్ వ్యాప్తి గురించి ఎప్పుడూ కప్పిపుచ్చుకోలేదని, ప్రభుత్వం ఎటువంటి కప్పిపుచ్చడానికి అనుమతించదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్ పేర్కొన్నారు.

ఇక కరోనా వైరస్ విషయంలో ఇప్పటికే చైనా విషయంలో ప్రపంచ దేశాలకి చాలా అనుమానాలు ఉన్నాయి. కావాలనే చైనా నిర్లక్ష్యం చేసిందని ఇప్పటికే అమెరికాతో పాటు పలు దేశాలు గట్టిగా వాదిస్తున్నాయి. అంతేకాకుండా కరోనావైరస్ నుండి మరణించినవారి సంఖ్యను చైనా తప్పుదోవ పట్టిస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో చైనా మరణాల సంఖ్యను సవరించడంతో చైనా పైన అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories