Xi Jinping: నేనే రాజు.. నేనే మంత్రి..

China,: చైనా శాశ్వత అధ్యక్షుడిగా తన అధికారాన్ని పదిలం చేసుకునే దిశగా జిన్‌పింగ్ పావులు కదుపుతున్నారు.

Arun Chilukuri
Updated on: 12 Sept 2022 8:45 PM IST
Chinas Communist Party to Confer More Power to President Xi Jinping
X

Xi Jinping: నేనే రాజు.. నేనే మంత్రి..

China: చైనా శాశ్వత అధ్యక్షుడిగా తన అధికారాన్ని పదిలం చేసుకునే దిశగా జిన్‌పింగ్ పావులు కదుపుతున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వచ్చే నెలలో జరిగే CPC ప్లీనరీ ఆయనకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం సహా రికార్డు స్థాయిలో మూడోసారి మరో 5ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం అధికారంలో కొనసాగేందుకు ఆమోదం తెలపనుంది. వచ్చే నెలలో రెండో సారి పదవీకాలం పూర్తికానుంది. గత శుక్రవారం జరిగిన పొలిట్ బ్యూరో భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కామ్రేడ్ జిన్‌పింగ్ సారథ్యంలోని CPC కేంద్ర కమిటీ గతంలో సాధించిన విజయాల ఆధారంగా మొత్తం పార్టీ, దేశ ప్రజలను ఏకం చేయడంతో పాటు దేశానికి నాయకత్వం వహించాలని CPC పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. ఈ ప్రకటన ద్వారా CPCకి జిన్‌పింగ్ సారథ్యం కొనసాగుతుందని ఖచ్చితమైన సంకేతాలు పంపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story