చైనా, అమెరికా మధ్య మాటల యుద్ధం.. కరోనా వైరస్ వ్యాప్తి చేసింది మీరంటే మీరంటూ..

చైనా, అమెరికా మధ్య మాటల యుద్ధం.. కరోనా వైరస్ వ్యాప్తి చేసింది మీరంటే మీరంటూ..
x
Zhao Lijian
Highlights

ఓ వైపు కరోనాకు ప్రపంచ వ్యాప్తంగా వేలల్లో జనం పిట్టల్లా రాలిపోతుంటే అసలు వైరస్ వ్యాప్తి చేసింది ఎవరనే దానిపై రెండు అగ్రదేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది....

ఓ వైపు కరోనాకు ప్రపంచ వ్యాప్తంగా వేలల్లో జనం పిట్టల్లా రాలిపోతుంటే అసలు వైరస్ వ్యాప్తి చేసింది ఎవరనే దానిపై రెండు అగ్రదేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. చైనాలోని వుహాన్‌లో మొదటిసారి బయటపడ్డ ఈ వైరస్ వ్యాప్తి అమెరికా సైన్యం పనే అని చైనా విదేశాంగ ప్రతినిధి జావ్ లిజియాన్ ఆరోపించారు.

ఈ వైరస్ బయటి దేశం నుంచే వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ఇతర నాయకులు కొవిడ్ వైరస్‌ వ్యాప్తికి చైనాయే మూలమన్నట్లు మాట్లాడారు. ఒకానొక సందర్భంలో వుహాన్ వైరస్ అని కూడా స్టేట్‌మెంట్లు ఇచ్చారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా అగ్రనాయకులు ఈ వైరస్ అమెరికా వల్లే తమ దేవంలోకి వచ్చిందని ఆరోపణలను తిప్పికొడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories