Donald Trump: మరోసారి చైనాపై ట్రంప్‌ హాట్ కామెంట్స్

Donald Trump: కొవిడ్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన నష్టానికి చైనా పరిహారం చెల్లించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేశారు.

Arun Chilukuri
Updated on: 7 Jun 2021 8:45 AM IST
China Must pay For Covid Damage, Says Donald Trump
X

డొనాల్డ్‌ ట్రంప్‌(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Donald Trump: కొవిడ్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన నష్టానికి చైనా పరిహారం చెల్లించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. కరోనా మహమ్మారికి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా బాధ్యత స్వీకరించాలని పరిణామాలను చైనా అనుభవించాలని ప్రపంచం మొత్తం ముక్తకంఠంతో చెప్పాలన్నారు. అన్ని దేశాలు కలిసి చైనాకు కనీసం 10 ట్రిలియన్‌ డాలర్లకు తక్కువ కాకుండా పరిహారం చెల్లించాలనే బిల్లు ఇవ్వాలని కోరారు ట్రంప్.

వారు చేసిన నష్టానికి అది కూడా చాలా తక్కువ. ఇప్పటికే చైనా నుంచి తీసుకొన్న అప్పుల చెల్లింపును నిలిపివేయాలి. దానిని తొలి విడత పరిహారం చెల్లింపుగా భావించాలి. ప్రపంచ దేశాలు చైనాకు డబ్బులు చెల్లించకూడదు. అది చాలా దేశాలను ఆర్థికంగా సర్వనాశనం చేసింది. అలాంటి దేశాలకు చైనా డబ్బు చెల్లించాలి అని ట్రంప్‌ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story