జాబిల్లిపై ప్రయోగాల్లో మరో ముందడుగు.. త్వరలో భూమిపైకి జాబిల్లి నమూనా

జాబిల్లిపై ప్రయోగాల్లో మరో ముందడుగు.. త్వరలో భూమిపైకి జాబిల్లి నమూనా
x
Highlights

జాబిల్లిపై ప్రయోగాలకు చైనా మరో ముందడుగు వేసింది. చంద్రుడి నమూనాలు భూమిపైకి తీసుకొచ్చేందుకు మానవరహిత వ్యోమనౌకను విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. చైనా...

జాబిల్లిపై ప్రయోగాలకు చైనా మరో ముందడుగు వేసింది. చంద్రుడి నమూనాలు భూమిపైకి తీసుకొచ్చేందుకు మానవరహిత వ్యోమనౌకను విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. చైనా పంపిన ఈ వ్యోమనౌక చంద్రుడిపై నమూనాలు సేకరించి భూమికి తీసుకురానుంది.

జాబిల్లి నమూనాల సేకరణ కోసం గత నలభై ఏళ్లుగా ప్రయోగాలు నిలిచిపోగా మళ్లీ చైనా ఈ ప్రయోగాన్ని పునరుద్ధరించింది. గతంలో అమెరికా మానవ సహిత వ్యోమనౌకను పంపగా రష్యా మానవ రహిత ప్రయోగం చేసింది. ఆ తర్వాత చైనాదే తొలి ప్రయోగం. చంద్రుడి నుంచి వచ్చే నమూనాలతో నీరు, ఆక్సిజన్ తయారుచేయొచ్చని గత ప్రయోగాలు వెల్లడించాయి. దీంతో జాబిలిపై అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తాజా నమూనాలు ఉపయోగపడతాయని చైనా తెలిపింది.


Show Full Article
Print Article
Next Story
More Stories