కంత్రీ కంట్రీ మరో డేంజర్ ప్రయోగం.. మైండ్ కంట్రోల్ వెపన్‌తో జరిగేదేంటి?

China Is Developing Mind Control Weaponry
x

కంత్రీ కంట్రీ మరో డేంజర్ ప్రయోగం.. మైండ్ కంట్రోల్ వెపన్‌తో జరిగేదేంటి?

Highlights

Mind Control: మైండ్ కంట్రోలింగ్ వెపన్ సింపుల్‌గా అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే వశీకరణం.

Mind Control: మైండ్ కంట్రోలింగ్ వెపన్ సింపుల్‌గా అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే వశీకరణం. కంత్రీ కంట్రీ డ్రాగన్ ఇప్పుడు ఈ అంశంపైనే ఫోకస్ చేసింది. శత్రు దేశాలతో యుద్ధం అంటూ వస్తే సింగిల్ బుల్లెట్ కూడా ఖర్చు కాకుండా ఎనిమీని ఫినిష్ చేసేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇంతకూ, డ్రాగన్ కంట్రీ సిద్ధం చేస్తున్న మైండ్ కంట్రోలింగ్ వెపన్‌తో ఏం జరుగుతుంది..? ఈ ప్రయోగం సక్సెస్ అయితే ప్రపంచ దేశాల్లో ఊహించని మార్పులు ఖాయమేనా..? డ్రాగన్ కంట్రీ ప్రయోగం మూడో ప్రపంచ యుద్ధానికి తీరితీస్తుందా?

ప్రపంచాన్ని శాసించాలని కంకణం కట్టుకున్న డ్రాగన్ కంట్రీ చైనా అందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. నింగీ, నేల, నీరు ఇలా ప్రతిచోట తనదైన మార్క్‌ చూపించి అగ్రదేశంగా ఎదిగేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది చైనా. అయితే, ఈ ప్రాసెస్‌లో ప్రపంచ దేశాలకే సవాల్ విసిరే ప్రయోగాలు చేయడం టెన్షన్ పడాల్సిన అంశమే. స్పేస్ స్టేషన్‌, సోలార్ పవర్ ప్లాంట్ అంటూ ఆకాశాన్ని గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైనా డ్రాగన్ ఇప్పుడు బయోటెక్నాలజీ పేరుతో మోస్ట్ డేంజరస్ ఆయుధాలకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ వెపన్స్ తయారీలో చైనా సక్సెస్ అయితే ప్రపంచ దేశాలకు ఊహించని ముప్పు తప్పదన్న విశ్లేషణలు ఓ వైపు కొనసాగుతుండగానే మైండ్ కంట్రోలింగ్ వెపన్ అప్‌డేట్ గ్లోబల్‌కు ఊహించని ఝలక్ ఇచ్చింది. అయితే, ఈ మైండ్ కంట్రోలింగ్ ఆయుధాలతో ఎలాంటి విపత్తులు ఎదురు కాబోతున్నాయి..? మూడో ప్రపంచ యుద్ధానికి జిన్‌పింగ్ చేస్తున్న చెత్త ప్రయోగాలే వేదిక కాబోతున్నాయా..?

టార్గెట్‌పై గురిపెట్టిన ట్రిగ్గర్ ఎక్కుపెట్టిన వారినే అంతం చేస్తే..? కంత్రీ కంట్రీ డ్రాగన్ మైండ్ కంట్రోలింగ్ వెపన్ లక్ష్యం ఇదే. మన పురాణాల్లో వశీకరణగా పిలిచే మైండ్ కంట్రోల్‌ను అక్షరాలా ఆచరణలో పెట్టి తనకు శత్రువనేవాడే లేకుండా చేయాలన్నదే జిన్‌పింగ్ మాస్టర్ ప్లాన్. ఈ విషయంలో విజయం సాధిస్తే ప్రపంచ పెద్దన్న ఏం ఖర్మ, భూగ్రహాన్నే శాసించే వీలుంటుందని ఇలాంటి కంత్రీ ప్రయోగాలు చేస్తోంది. అఫిషియల్‌గా నిర్ధారణ కాకపోయినా బయోవార్‌లో భాగంగానే చైనా కరోనా వైరస్‌ను ప్రపంచం మీదికి వదిలిందని అన్ని దేశాలు నమ్ముతున్నాయి. తాజాగా బయోటెక్నాలజీ పేరుతో తయారుచేస్తున్న ఆయుధాల్లో భాగంగా ఈ మైండ్ కంట్రోల్ వెపన్స్ సిద్ధం చేస్తుందన్న వార్తలు డ్రాగన్ తీరును ఇట్టే తెలియజెబుతున్నాయి. అయితే, ఈ ప్రయోగంలో చైనా విజయం సాధిస్తే ఏం జరుగుతోంది..? అసలు చైనా ప్రయోగాలపై అనుమానాలు ఎందుకొస్తున్నాయి.?

ఇటీవ‌ల యూఎస్ వాణిజ్య విభాగం 12 చైనీస్ ఇన్‌స్టిట్యూట్లు, సంస్థ‌ల‌ను బ్లాక్‌లిస్ట్ చేయ‌డమే డ్రాగన్ మైండ్ కంట్రోలింగ్ వెపన్స్ సిద్ధం చేస్తోందన్న అనుమానాలకు బలం చేకూర్చాయి. అగ్రరాజ్యం బ్లాక్‌లిస్ట్ చేసిన ఇన్‌స్టిట్యూట్ల‌లో ఒకటి బీజింగ్స్ అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్ కూడా ఉంది. కాగా, మైండ్ కంట్రోల్ వెప‌న్స్ గురించి అమెరికా ప్ర‌భుత్వం ఎలాంటి వివరాలను వెల్లడించనప్పటికీ, వాషింగ్టన్ టైమ్స్ ప్ర‌చురించిన‌ 2019 మిలటరీ డాక్యుమెంట్స్ ఊహించని వివరాలను వెల్లడిస్తున్నాయి. వాటిల్లో డ్రాగన్ కంట్రీ పలు ప్రమాదకర ఆయుధాలపై ఫోకస్ చేసినట్టు వాషింగ్టన్ టైమ్స్ అంచనా వేసింది. వీటిల్లో మైండ్ కంట్రోలింగ్ వెపన్స్‌దే పై చేయి అనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. చైనా త‌యారు చేస్తున్న మైండ్ కంట్రోల్ వెప‌న్స్‌ సాంప్ర‌దాయ ఆయుధాల‌కు భిన్నంగా ప‌నిచేస్తాయి. సాంప్ర‌దాయ ఆయుధాలు వ్య‌క్తిని భౌతికంగా గాయ‌ప‌రిస్తే ఈ మైండ్ కంట్రోల్ వెప‌న్స్ శ‌త్రువును మాన‌సికంగా అదుపులోకి తీసుకుంటాయి. శత్రువును ఎటూ క‌ద‌ల‌కుండా చేసి స్తంభింప‌జేసి, విజయం సాధిస్తాయి.

మైండ్ కంట్రోల్ అంటే బ్రెయిన్‌ను నియంత్రించడమే మనిషి బ్రెయిన్‌లోని ప్రతి ఆలోచనా వారికి ఈజీగా తెలిసిపోతుంది. మైండ్‌లో ఫ్లాష్‌గా కదిలే థాట్స్‌ను క్షణాల్లో రీడ్‌ చేసేస్తారు. ఫోన్‌ పట్టుకున్నా, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి ఇంటర్నెట్‌ ఫోరమ్స్‌ మీద యాక్టివ్‌గా వున్నా, ఇట్టే టార్గెట్‌ చేసేస్తారు. ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి, బెదిరిస్తారు. తన ఆలోచనల గురించి ముందే కామెంట్‌ చేస్తారు. థాట్‌ ప్రాసెస్‌లోనే టెక్ట్స్‌ రూపంలో వెంటనే రెస్పాండ్ అవుతారు. ఒక్కసారి జనరల్‌గా ఆలోచించండి, మీరు చెప్పకున్నా, మీ ఆలోచనలు బయటి ప్రపంచానికి తెలిసిపోతే? ఎంత మెంటల్‌ టార్చర్‌గా వుంటుందో? ఇప్పుడు డ్రాగన్ సైతం శత్రువులను ఇలానే దెబ్బకొట్టాలని చూస్తోంది. నిజానికి మైండ్‌ కంట్రోల్‌ టెక్నాలజీ వెపన్స్ మన కళ్లకు కనపడవు. అత్యంత సూక్ష్మంగా వుంటాయి. వీటిని గాల్లోకి స్రే చేస్తారు. అనంతరం ఆ గాలిని పీల్చుకున్న శత్రువు ముక్కు ద్వారా తలలోకి ప్రవేశించి బ్రెయిన్‌లోకి చేరుతాయి. అక్కడినుంచే అసలైన ఆపరేషన్ మొదలయ్యేది.

ఒక్కసారి నానోబ్యాట్స్‌ మెదడులో నిక్షిప్తమయ్యాయంటే, శత్రువు వారికి బానిసకాక తప్పదు. బ్రెయిన్‌లో మనిషి ఆలోచనలు చేసినప్పుడు సహజంగానే ఎలక్ట్రిక్‌ సిగ్నల్‌‌ వస్తుంటాయి. ఈ న్యానోబాట్స్‌ వాటి నుంచే పవర్‌ను తీసుకుంటాయి. అంటే ట్వంటీ ఫోర్ అవర్స్‌ అవి రీఛార్జ్‌ అవుతూనే వుంటాయి. ఈ న్యానోబాట్స్‌ డ్రాగన్ కంప్యూటర్స్‌కు‌ లింక్ అయ్యి వుంటాయి. దీంతో శత్రువు ఆలోచనలు వారి కంప్యూటర్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. మాట పెదవి దాటకుండానే అవతలి వ్యక్తికి విషయం తెలిసి పోతుంది. తద్వారా శత్రువును ఎలాఢీకొట్టాలో తెలిసిపోతుంది. నిజానికి దీనికి సంబంధించిన టెక్నాలజీపై అగ్రరాజ్యం అమెరికా ఎప్పటి నుంచో ప్రయోగాలు చేస్తోంది. ఆ విషయంలో సీఐఏ కొంతవరకూ సక్సెస్ అయిందన్న విశ్లేషణలు కూడా వినిపించాయి. తాజాగా చైనా ఈ విషయంలో అగ్రరాజ్యాన్ని దాటి సరికొత్త ఆవిష్కరణలు చేయాలని డిసైడ్ అయింది.

బయోటెక్నాలజీ లాంటి కీలక రంగాలపై కంట్రోలింగ్ సాధించి అమెరికా టెక్నాలజీని పొందేందుకు చైనా ప్రయత్నిస్తోందని వైట్‌ఔస్ ఇటీవలే అనుమానాలు వ్యక్తం చేసింది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ "జన్యు సవరణ, మానవ పనితీరు ఇంప్రూవ్మెంట్, మైండ్ మెషీన్ ఇంటర్‌ఫేస్‌" లాంటి రంగాలలో టెక్నాలజీ డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్‌కు సమాచారం అందింది. ఇదే సమయంలో గత మూడు దశాబ్దాలలో చైనా సైనిక సామర్థ్యాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి. రాబోయే సంవత్సరాల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ US మిలిటరీ స్థాయికి చేరుకోవచ్చని చాలామంది భయపడుతున్నారు. అదే జరిగితే ప్రపంచ దేశాలకు అసలు ముప్పు ముందే ఉన్నట్టే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా బయోటెక్నాలజీ పేరుతో డ్రాగన్ చేస్తున్న ప్రయోగాలు ప్రపంచ దేశాలకు పెను సవాళ్లనే విసిరేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ అంశంలో అగ్రరాజ్యం అమెరికాను దాటుకుని చైనా వెళ్లగిలిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం లేకపోలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories