రాత్రి వేళ కూడా సూర్యుడిని చూడాలనుకుంటున్నారా?.. రెడీ అవుతున్న చైనా సూర్యుడు..

రాత్రి వేళ కూడా సూర్యుడిని చూడాలనుకుంటున్నారా?.. రెడీ అవుతున్న చైనా సూర్యుడు..
x
చైనా సూర్యుడు
Highlights

భగభగ మండే భానుడికి పోటీదారుడు వచ్చేస్తున్నాడు. జీవి మనుగడను శాసిస్తున్న సూర్యుడు కూడా షాకయ్యే రోజు వచ్చేస్తోంది. సృష్టికే ప్రతి సృష్టి చేస్తున్న మానవ...

భగభగ మండే భానుడికి పోటీదారుడు వచ్చేస్తున్నాడు. జీవి మనుగడను శాసిస్తున్న సూర్యుడు కూడా షాకయ్యే రోజు వచ్చేస్తోంది. సృష్టికే ప్రతి సృష్టి చేస్తున్న మానవ మేథస్సు ఇప్పుడు సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. కనీవినీ ఎరగని అద్భుతాన్ని కళ్ల ముందు ఉంచబోతోంది? ఇంతకీ ఏంటది? సూర్యుడు షాకయ్యే ఆ రోజు ఎప్పుడు వస్తుంది? అంతలా షాకయ్యే పరిస్థితి ఏం ముంచుకొస్తుంది?

ఇది నిజంగా అద్భుతమే. మేథస్సుకు మేత పెట్టే ఆవిష్కరణే. అసలుకు, నకిలీకు తేడా లేకుండా ప్రత్యామ్నాయ వస్తువులను తయారు చేసే చైనీయులు ఇప్పుడు సూర్యుడికి పోటీ దారుడిని పరిచయం చేయబోతున్నారు. వచ్చే ఏడాది నాటికి దానికో రూపం తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నం చేస్తోంది. సాధారణ సూర్యుడిని పోలిన దినకరుడిని ఆకాశంలో చూపించబోతున్నారు.

సూర్యుడు... పొద్దున్నే కనిపిస్తాడు - సాయంత్రం కాగానే అస్తమిస్తాడు - రాత్రిళ్లు... చందమామ చల్లని కిరణాలు - తెల్లారితే కానీ రవిని చూడలేని కనులు - రాత్రయ్యాక కూడా సూర్యుడిని చూడాలనుకుంటున్నారా?

రండి మేం చూపిస్తామంటోంది చైనా. అవును ఇప్పటికే కృతిమ చంద్రుడిని తయారు చేసే పనిలో బిజీగా ఉన్న చైనా శాస్త్రవేత్తలు మరో ప్రయోగానికి తుదిరూపు ఇస్తున్నారు. కృతిమ సూర్యుడికి మెరుగులు దిద్దుతున్నారు. సూర్యుడిలో జరిగే న్యూక్లియర్‌ ఫ్యూజన్‌ ప్రక్రియను కృత్రిమంగా జరిపించడం ద్వారా సూర్యుడి కన్నా పది రెట్లు అంటే 10 కోట్ల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతతో శుద్ధమైన శక్తిని విడుదలయ్యేలా చేయబోతున్నారు.

సాధారణ సూర్యుడు, నక్షత్రాలు నియంత్రిత అణు విచ్చిత్తి ద్వారా అనంతమైన శక్తిని అందిస్తున్నట్టుగానే అణు విచ్చిత్తి ప్రక్రియ ప్రతిబింబించేందుకు నూ-2వీ టోకామాక్‌ పరికరాన్ని చైనా తయారు చేస్తోంది. దీనినే కృతిమ సూర్యుడిగా పిలుస్తున్నారు. ఆకాశంలో సూర్యుడు కదలికలు ఉండే మాదిరిగానే చైనా సూర్యుడు రెడీ అవుతున్నాడు.

ఏ వస్తువుకైనా ప్రత్యామ్నాయ వస్తువును తయారు చేయడంలో చైనానే నెంబర్‌వన్‌. అసలు, నకిలీకి తేడా లేకుండా తయారు చేయడంలో వారిని మించిన వారు ఉండరేమో. వస్తువుల వరకు ఓకే కానీ అసాధ్యం అనుకునే వాటికి కూడా నకలు సృష్టించేందుకు చైనా సిద్ధమవుతోంది. సూర్యుడి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడమే కష్టమవుతున్న తరుణంలో ఆ సూర్యడికే ప్రతిసృష్టి చేయాలని భావిస్తోంది.

మనకు ఏదైనా వస్తువుకు నకలు కావాలంటే అది కచ్చితంగా చైనాలో దొరుకుతుందన్నది ఓ నమ్మకం. అసలు సిసలు బ్రాండ్‌ వస్తువులకు ఏమాత్రం తీసిపోని విధంగా నకలు తయారు చేయడంలో ఎవరైనా చైనా తర్వాతే. ఆ వస్తువు ధరను బట్టి అది అసలైనదా, నకిలీదా అని పోల్చవచ్చేమో గానీ ఆ రెండింటి ధరలు ఒకటైతే మాత్రం పోల్చడం చాలా కష్టం. చైనా పనితనం అలా ఉంటుంది మరి. ఇవన్నీ చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేసే కొత్త ప్రయోగానికి చైనా తెరతీసింది. అంటే అది వస్తువుల విషయంలో మాత్రం కాదు. ఏకంగా సూర్యుడినే సృష్టించబోతోంది.

సూర్యడు ఏమాత్రం కన్నెర్రజేసినా తట్టుకోలేని పరిస్థితి మనది. అలాంటిది ఏకంగా భూమ్మీద సూర్యుడి శక్తిని పునర్‌సృష్టి చేయడం సాధ్యమా! కానీ చైనా మాత్రం సాధ్యమే అంటోంది. సూర్యుడి శక్తిని భూమ్మీద పొందేందుకు కృత్రిమ సూర్యుడ్ని అభివృద్ధి చేస్తున్నట్లు చైనా సైంటిస్టులు ప్రకటించడమే కాదు దాన్ని ఆవిష్కరించి ఆశ్చర్యపరిచేందుకు రెడీ అవుతున్నారు. హెచ్‌ఎల్-2ఎం టోకమాక్‌ పేరుతో ఈ ప్రాజెక్టుకు శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. నిజమైన సూర్యుడి ఉపరితలంపై సహజంగానే ఉండే ప్రక్రియల మాదిరిగానే చైనా సూర్యుడు కూడా పని చేయబోతున్నాడు.

ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడి కన్నా కృత్రిమ సూర్యుడు 13 రెట్ల అధిక శక్తిని విడుదలయ్యేలా చేయనుంది. చైనా నేషనల్‌ న్యూక్లియర్‌ కార్పొరేషన్‌, సౌత్‌ వెస్ట్రన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ కలిసి చేపట్టాయి. దీనిపై పరిశోధనలు జరిపేందుకు సిజువన్‌ ప్రావెన్స్‌లోని అణు రియాక్టర్‌ ఉన్న లెషన్‌ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. హెచ్‌ఎల్‌-2ఎం పరికరం ద్వారా దాదాపు రెండు వందల మిలియన్‌ డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను సృష్టించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి సూర్యుడి ఉపరితలంపై కేవలం 15 మిలియన్‌ డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రత మాత్రమే వెలువడుతుంది. ఈ లెక్కన చూసుకుంటే ఈ పరికరం ద్వారా ఉత్వత్తయ్యే ఉష్ణోగ్రత 13రెట్లు అధికంగా ఉండనుంది.

సూర్యుడిలో కేంద్రక సంలీన చర్య నిరంతరం జరుగుతుండడం వల్ల శక్తి అనంతంగా జనిస్తూ ఉంటుంది. అందుకే అక్కడ ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం అణు రియాక్టర్లలో అందుకు భిన్నమైన ప్రక్రియ చేపడుతున్నారు. కేంద్రక విచ్ఛితి ద్వారా అణువులు విడగొడతారు. దీని ద్వారా శుద్ధమైన, చౌకైన శక్తి లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఎంతో శ్రమ, ఆపదలతో కూడిన వ్యవహారం. అయినా చైనా కోణంలో ఆలోచిస్తే ఈ ప్రాజెక్టు విజయవంతం కావడం ఎంతో ముఖ్యం. నిజానికి చైనా కృత్రిమ సూర్యుడి శక్తిని భూమి మీద సృష్టించేందుకు మూడు దశాబ్దాల కిందటే మొదలుపెట్టింది. 1984లో తన తొలి సంలీన పరికరమైన హెచ్‌ఎల్‌-1ను రూపొందించింది. దానిని చైనాలోని అతిపురాతన, అతి పెద్దదైన సౌత్‌ వెస్ట్రన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ రూపొందించింది.

మొత్తానికి ఉదయం చూసిన సూరీడు సాయంత్రానికి అస్తమిస్తాడు. ఇప్పుడు ఇదంతా గతం కానుంది. సమీప భవిష్యత్తులో రాత్రి కూడా భానుడి భగభగలను ప్రజలు చూడబోతున్నారా? ఏమో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories