అక్కడ మళ్లీ కరోనా బుసలు.. మళ్లీ లాక్‌డౌన్లు..

China: చైనాలో మళ్లీ కరోనా విలయ తాండవం చేస్తోంది.

Arun Chilukuri
Published on: 11 Oct 2022 11:15 AM IST
China Imposed Lockdown Amid Surge in COVID-19 Cases
X

అక్కడ మళ్లీ కరోనా బుసలు.. మళ్లీ లాక్‌డౌన్లు..

China: చైనాలో మళ్లీ కరోనా విలయ తాండవం చేస్తోంది. ఈనెల తొలి వారంలో జాతీయ సెలవులు ప్రకటించడంతో ప్రజలంతా ఎంజాయ్ చేశారు. వాస్తవానికి ప్రయాణాలను తగ్గించుకోవాలన్న నిబంధనలు ఉన్నా ప్రజలు మాత్రం హాలీడేస్‌లో ఫుల్ ఎంజాయ్ చేశారు. అదే ఇప్పుడు కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణమని వైద్యులు భావిస్తున్నారు. కొన్ని పట్టణాల్లో నిన్న సోమవారం నుంచే మళ్లీ లాక్‌డౌన్లు ప్రారంభించారు. మరోవైపు వచ్చే వారం నుంచి బీజింగ్‌లో కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ముందస్తుగానే లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. తాజాగా ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్సులో ఉన్న ఫెన్‌యాంగ్ సిటీలో లాక్‌డౌన్ విధించారు. మంగోలియా ప్రాంతాల్లోనూ ఆంక్షలు విధించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story