Coronavirus: చైనాకు ఇంకా కొనసాగుతున్న కరోనా కష్టాలు

Coronavirus: చైనాకు ఇంకా కొనసాగుతున్న కరోనా కష్టాలు
x
Highlights

కరోనా వైరస్ నుంచి మానవాళికి ఇప్పట్లో మోక్షం లేదా? వైరస్ ని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలన్నీ ఒక్కటై పాటు పడాల్సిందేనా? చైనా అనుభవాలు ఏం...

కరోనా వైరస్ నుంచి మానవాళికి ఇప్పట్లో మోక్షం లేదా? వైరస్ ని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలన్నీ ఒక్కటై పాటు పడాల్సిందేనా? చైనా అనుభవాలు ఏం చెబుతున్నాయి?చైనాలో సెకండ్ వేవ్ మొదలైందా? గతరెండు రోజులుగా పెరుగుతున్న కేసులు ఏం సూచిస్తున్నాయి.

కరోనా మహమ్మారి చైనాలో తగ్గినట్లే తగ్గి మళ్లీ చెలరేగుతోందా? చైనాలో మళ్లీ పెరుగుతున్న కేసులకి కారణాలేంటి? కోవిడ్ 19 ఒకసారి వస్తే ఇక ఆ దేశాలకు ఉపశమనం అనేది ఉండదా? పరిస్థితులు చూస్తుంటే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. మెయిన్ లాండ్ చైనాలో మళ్లీ 108కొత్త కేసులు బలపడటం దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఒక్క ఆదివారమే ఏకంగా 99 కేసులు వెలుగుచూడటంతో చైనా ఉలిక్కి పడింది. తగ్గిందనుకున్న మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోందని చైనా హడలిపోతోంది అయితే చైనాలో ఈవైరస్ మళ్లీ పెచ్చరిల్లడానికి కారణం మాత్రం రష్యా చైనా ఈశాన్య ప్రాంతం చాలా సుదీర్ఘమైన సరిహద్దును చైనాతో పంచుకుంటోంది. కరోనా దెబ్బకు కుదేలైపోయిన చైనా ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టుకుంటోంది. కానీ పొరుగు దేశం నుంచి ట్రాన్స్ మిట్ అవుతున్న కేసుల వల్ల కోవిడ్ 19 సెకండ్ వేవ్ వస్తుందేమోనన్న భయం చైనాను వెంటాడుతోంది.

రష్యాలోని ఫార్ ఈస్ట్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ నుంచి వ్లాడివోస్టాక్ నగరానికి చేరడానికి చైనా సరిహద్దులు దాటుతున్నారు. రష్యాలో నివసిస్తున్న కొందరు చైనీయులు స్వదేశానికి వచ్చేయాలనుకోవడంతో వారంతా తట్టా బుట్టా సర్దుకుని బయల్దేరుతున్నారు. చైనా, రష్యా దేశాల మధ్య విమాన సర్వీసులు నిలిపివేసినా కొందరు మాత్రం సరిహద్దుల గుండా నడుచుకుంటూ చైనాలో ప్రవేశిస్తున్నారు. వుహాన్ తరహాలో సరిహద్దు నగరాల్లో కూడా లాక్ డౌన్ ప్రకటించడంతో చైనాలోని సరిహద్దు నగరాల్లో వీధులు నిర్మానుష్యంగా మారాయి. ఫిబ్రవరి 12 నాటికి చైనాలో 15 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. చైనాలో రోజు వారీ కేసుల పెరుగుదల బాగా తగ్గిపోయింది కానీ ఇలా ఇతర దేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్ మళ్లీ వ్యాపించడంతో కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. రష్యా నుంచి సరిహద్దులు దాటుతున్న వారిని నిలువరించలేని చైనా వారిని నేరుగా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తోంది. షాంహైలో ఏరో ఫ్లాట్ ఫ్లైట్ లో మాస్కో నుంచి వచ్చిన వారిలో 60 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.

బీజింగ్ లో ఇప్పటికీ ఇంపోర్టెడ్ కేసులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చైనా దేశీయులెవరూ సరిహద్దులు దాటకుండా కఠిన చర్యలు తీసుకుంది. వాస్తవానికి సరిహద్దులని అధికారులు కాపలా కాయగలరు కానీ చైనా రష్యా సరిహద్దులు చాలా పెద్దగా ఉండటం కొన్ని చోట్ల కొండలు, గుట్టలు, చిన్న చిన్న కాలిబాటలు ఉండటం వల్ల రష్యానుంచి వలస వస్తున్న వారిని గుర్తించలేని పరిస్థితి ఉంది. చైనాలో ఇప్పటి వరకూ లోకల్ ట్రాన్సిమిషన్ అంతా సరిహద్దుల నుంచి వలస వచ్చిన వారి వల్లనే అన్నది చైనా అధికారులు చెబుతున్న మాట..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories