భారత్ - నేపాల్ మధ్య మరో వివాదం.. భారత్ ను చుట్టుముడుతున్న చైనా..

భారత్ - నేపాల్ మధ్య మరో వివాదం.. భారత్ ను చుట్టుముడుతున్న చైనా..
x
Highlights

ఈ రోజు మనం మాట్లాడుకుందాం భారత్- నేపాల్ సరిహద్దు వివాదం గురించి. కొన్ని దశాబ్దాలుగా నేపాల్ తో ఉన్న స్నేహసంబంధాలు ఇప్పుడు సంక్షోభంలో పడిపోయాయి. ఈ...

ఈ రోజు మనం మాట్లాడుకుందాం భారత్- నేపాల్ సరిహద్దు వివాదం గురించి. కొన్ని దశాబ్దాలుగా నేపాల్ తో ఉన్న స్నేహసంబంధాలు ఇప్పుడు సంక్షోభంలో పడిపోయాయి. ఈ చిచ్చు రగులుకోవడం వెనుక మరొక దేశం హస్తం ఉంది. నేపాల్ మరెవరి కోసమో సమస్యలు సృష్టిస్తోంది అని భారత సైనికాధిపతి జనరల్ నరవణే చేసిన వ్యాఖ్యల వెనుక అర్థం ఇదే. ఈ నేపథ్యంలో ఆ చిచ్చు రగులుకోవడం వెనుక చైనా హస్తం గురించి నాలుగు దిక్కులా భారత్ ను చుట్టుముడుతున్న చైనా వ్యూహం గురించి కూడా ఈ రోజు మనం మాట్లాడుకుందాం.

చైనీస్ వైరస్ కంటే ఇటాలియన్ వైరస్ కంటే కూడా ఇండియా వైరస్ మరింత ప్రమాదకరమైంది ఇవీ నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ మాటలు. సందర్భం ఏదైనప్పటికీ అసలు ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని భారత్ కలలో కూడా ఊహించి ఉండదు. అందుకే మరో దేశం ప్రోద్భలంతోనే ఈ వ్యాఖ్యలు వచ్చాయని అంటున్నవారూ ఉన్నారు. భారత్ తమ పట్ల పెద్దన్న ధోరణితో వ్యవహరిస్తోందని నేపాల్ కొన్నేళ్లుగా భావిస్తోంది. తాజాగా అది భారత్ పై ఎన్నడూ లేని రీతిలో స్వరం పెంచింది.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories