Top
logo

విడాకులు తీసుకునే మహిళల కోసం చైనాలో కొత్త చట్టం

విడాకులు తీసుకునే మహిళల కోసం చైనాలో కొత్త చట్టం
X

విడాకులు తీసుకునే మహిళల కోసం చైనాలో కొత్త చట్టం

Highlights

చైనా కోర్టు ఇచ్చిన ఓ తీర్పు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ చర్చకు దారి తీసింది. భార్యకు విడాకులు ఇవ్వాలనుకునే వ్యక్తి ...

చైనా కోర్టు ఇచ్చిన ఓ తీర్పు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ చర్చకు దారి తీసింది. భార్యకు విడాకులు ఇవ్వాలనుకునే వ్యక్తి భరణంతో పాటు గతంలో తన భార్య చేసిన ఇంటి పనికి కూడా డబ్బులు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ప్రస్తుతం ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మహిళల పని పట్ల మీకు ఇంత చిన్న చూపా అంటూ కొందరు విమర్శలు చేస్తుండగా కనీసం ఇప్పటికైనా గుర్తించారు అంటూ మరి కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరమే అమల్లోకి వచ్చిన చైనా కొత్త సివిల్ కోడ్ ప్రకారం విడాకులు తీసుకునే జంటలు కలిసి ఉన్న రోజుల్లో భార్యలు ఇంటి బాధ్యతలు ఎక్కువగా తీసుకుంటే అందుకు గాను వారు పరిహారం కోరవచ్చు.

Web TitleChina court orders man to pay wife for housework in landmark Divorce Case
Next Story