కల్లోలం లోనూ చైనా నాశిరకం దందా.. కరోనా కిట్లపై దుమారం!

కల్లోలం లోనూ చైనా నాశిరకం దందా.. కరోనా కిట్లపై దుమారం!
x
Highlights

చైనా వస్తువులు అంటేనే నాసిరకం. ఆ వస్తువులు తొందరగా పాడైపోతాయి అనే విమర్శ ఎప్పటి నుంచో జనాల్లో ఉంది. కానీ, డ్రాగన్ దేశం మాత్రం తన పంథాను ఏ మాత్రం...

చైనా వస్తువులు అంటేనే నాసిరకం. ఆ వస్తువులు తొందరగా పాడైపోతాయి అనే విమర్శ ఎప్పటి నుంచో జనాల్లో ఉంది. కానీ, డ్రాగన్ దేశం మాత్రం తన పంథాను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ప్రపంచాన్ని కలవర పెడుతున్న కరోనా వైరస్ ను త్వరగా కనిపెట్టేందుకు చైనా నుంచి ర్యాపిడ్ టెస్ట్ కిట్లను దిగుమతి చేసుకున్నారు. కరోనా టెస్ట్‌లను పెంచేందుకు చాలా రాష్ట్రాలు చైనా నుంచి ర్యాపిడ్ కిట్లను దిగుమతి చేసుకున్నాయి. అయితే అవి సరిగా పనిచేయకపోవడంతో వాటిని తిరిగి పంపించేందుకు రెడీ అవుతున్నాయి ప్రభుత్వాలు.

చైనా వస్తువులు నాణ్యత పరంగా ఎక్కువ రోజులు ఉండవని చాలాకాలంగా విమర్శలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డ్రాగన్ దేశం తయారు చేసిన వస్తువులుపైన విమర్శలు వెల్లువెత్తినా వాటిని పెద్ద పరిగణలోకి తీసుకోదు. ఇప్పుడు కరోనా వైరస్ నిర్దారణకు ఉపయోగించే కరోనా వైరస్ టెస్ట్ కిట్ల విషయంలోనూ చైనా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో 90శాతం కచ్చితమైన ఫలితాన్ని ఇస్తాయని అంచనా వేశారు. రాజస్థాన్ లో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా 168 పరీక్షలు నిర్వహించారు. అందులో కరోనా పాజిటివ్ వచ్చిందని తేలింది. అంతకుముందు వాటిని పీసీఆర్ బేస్డ్ టెస్టుల్లో నెగిటివ్ తేలింది. దాంతో రాజస్థాన్ వైద్యులు షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు అవే ర్యాపిడ్ కిట్స్ విమర్శలకు కేంద్ర బిందువుగా మారాయి. దాంతో వాటిని తిరిగి పంపేందుకు పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ప్రభుత్వాలు రెడీ అయ్యాయి.

ఇదే విషయాన్ని రాజస్థాన్ ప్రభుత్వం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దృష్టికి తీసుకెళ్లింది. దాంతో రెండు రోజుల పాటు ర్యాపిడ్ కిట్స్ ను వాడొద్దని ICMR సూచించింది. అంతేకాదు ర్యాపిడ్ కిట్స్ పై విచారణ జరిపి మార్గదర్శకాలను విడుదల చేస్తామని కేంద్రం వెల్లడించింది.

ర్యాపిడ్ టెస్టులో నమూనాగా వేలి నుంచి రక్తం తీసి పరీక్షలు నిర్వహిస్తారు. దీని ద్వారా కరోనా ఆనవాళ్లను వేగంగా గుర్తిస్తారు. అయితే ఈ టెస్టుతో పాజిటివ్ అని తేలినా వారికి తిరిగి పీసీఆర్ టెస్ట్‌ చేసి మరోసారి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. అందులో వచ్చిన రిజల్ట్స్ బట్టి వ్యక్తికి కొవిడ్ వచ్చిందా లేదా అని తేలుస్తారు.

మొత్తానికి చైనా వస్తువుల్లో నాణ్యత లేదని మరోసారి రుజువు అయింది. కరోనా వైరస్ తో ప్రపంచం అంతా అల్లాడుతుంటే చైనా మాత్రం నాణ్యత లేని వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేసి లాభం కట్టుకుంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories