Trudeau-Trump: మా దేశాన్ని, మా గేమ్‌ను తీసుకోలేరు.. ట్రంప్‌కు ట్రూడో చురక

Canada PM Justin Trudeau Counter Donald Trump
x

మా దేశాన్ని, మా గేమ్‌ను తీసుకోలేరు.. ట్రంప్‌కు ట్రూడో చురక

Highlights

కెనడాను అమెరికాలో కలిపేసుకుంటామంటూ ట్రంప్ పదే పదే చేస్తున్న కామెంట్లకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కౌంటర్ ఇచ్చారు. బోస్టన్‌లో జరిగిన హాకీ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి అమెరికాను ఓడించిన తర్వాత కెనడా ప్రధాని ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టారు.

Trudeau-Trump: కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం, పదే పదే నోరు జారడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నైజం. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఆ డోస్ మరింత పెంచాడు. వారు వీరు అని తేడా లేకుండా ప్రపంచంలోని అన్ని దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి పొరుగు దేశం కెనడాతో కాలు దువ్వుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశంపై సుంకాలతో విరుచుకుపడడంతో పాటు కెనడాను 51వ అమెరికా రాష్ట్రంగా అభివర్ణిస్తూ వివాదానికి తెర లేపారు ట్రంప్.

కెనడాను అమెరికాలో కలిపేసుకుంటామంటూ ట్రంప్ పదే పదే చేస్తున్న కామెంట్లకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కౌంటర్ ఇచ్చారు. బోస్టన్‌లో జరిగిన హాకీ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి అమెరికాను ఓడించిన తర్వాత కెనడా ప్రధాని ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. మా దేశాన్ని, మా ఆటను మీరు తీసుకోలేరు అని ట్రంప్‌కు చురకంటించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కెనడాపై అమెరికా టీమ్ విజయం సాధించాలని, కెనడా త్వరలో అమెరికా 51వ రాష్ట్రంగా అవతరించాలని ట్రంప్ ఒక పోస్టులో ఆకాంక్షించారు. దీనికి బదులుగా హాకీ మ్యాచ్‌లో కెనడా అమెరికాపై విజయం సాధించిన తర్వాత.. కెనడా ప్రధాని ట్రంప్‌కు కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ ‌గా మారింది.

కెనడా పై అధిక సుంకాలు విధిస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారం నుంచే హెచ్చరిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. వలసలు, డ్రగ్స్ అక్రమరవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేని పక్షంలో సుంకాలు పెంచుతానని అన్నారు. ఈ క్రమంలోనే ట్రూడో పై పలుమార్లు విమర్శలు గుప్పించారు.

రెండోసారి అధ్యక్ష బాధ్యలు చేపట్టిన తర్వాత కెనడాపై 25 శాతం సుంకాలను విధించారు. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. దీనికి ప్రతిగా.. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కొన్ని వస్తువులపై తాము కూడా 25 శాతం సుంకం విధిస్తున్నట్టు ట్రూడో ప్రకటించారు. అనంతరం ఇరువురి మధ్య చర్చలు జరగడంతో ప్రతిపాదిత టారిఫ్‌లను కనీసం 30 రోజుల పాటు నిలిపివేసేందుకు అంగీకారం కుదిరింది.


Show Full Article
Print Article
Next Story
More Stories