British YouTuber : ఇండియా మీద అణుబాంబు వేస్తానన్న బ్రిటన్ యూట్యూబర్..ఈ ‘డేంజరస్ టూరిస్ట్’ హిస్టరీ ఏంటి?


British YouTuber : ఇండియా మీద అణుబాంబు వేస్తానన్న బ్రిటన్ యూట్యూబర్..ఈ ‘డేంజరస్ టూరిస్ట్’ హిస్టరీ ఏంటి?
British YouTuber sensational comments : భారతదేశం మీద న్యూక్లియర్ బాంబు వేస్తానని బ్రిటిష్ యూట్యూబర్ మైల్స్ రౌట్లెడ్జ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రౌట్లెడ్జ్ ఇటీవల పోస్ట్ చేసిన ఒక వీడియోలో తాను కనుక బ్రిటన్ ప్రధానమంత్రిని అయితే ఇండియా మీద అణుబాంబు వేస్తానని అన్నారు.
British YouTuber Sensational Comments : భారతదేశం మీద న్యూక్లియర్ బాంబు వేస్తానని బ్రిటిష్ యూట్యూబర్ మైల్స్ రౌట్లెడ్జ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రౌట్లెడ్జ్ ఇటీవల పోస్ట్ చేసిన ఒక వీడియోలో తాను కనుక బ్రిటన్ ప్రధానమంత్రిని అయితే ఇండియా మీద అణుబాంబు వేస్తానని అన్నారు. ఈ వ్యక్తి గతంలో అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడ ప్రత్యక్షమై వార్తల్లోకెక్కాడు.“నేను ఇంగ్లండ్ ప్రధానిని అయితే బ్రిటన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే దేశాలకు హెచ్చరికగా న్యూక్లియర్ బాంబులు ఉపయోగిస్తాను. అందుకోసం నేను ఇండియా మీదే బాంబు వేస్తానేమో” అంటూ రౌట్లెడ్జ్ తన వీడియోలో రేసిస్ట్ వ్యాఖ్యలు చేశాడు. దాంతో, తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
When I become prime minister of England, I'll open the nuclear silos as an explicit warning to any foreign power that interferes with British interests and affairs.
— Lord Miles (@real_lord_miles) August 20, 2024
I'm not talking huge incidents, I'm itching to launch and atomize entire nations over the smallest infraction. pic.twitter.com/UGBKYB3pku
ఇండియా గురించి ఇంకా ఏమన్నాడు?
రౌట్లెడ్జ్ గత మంగళవారం ఇండియన్ల గురించి వరసగా రేసిస్టు కామెంట్స్ పోస్ట్ చేశాడు. పేరు తెలియని ఒక ఎక్స్ యూజర్ పోస్ట్ స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ, అతడు తనను బెదిరిస్తున్నాడని రాశాడు. ఎలాంటి ఆధారాలు లేకున్నా ఆ యూజర్ ఇండియనే అని వ్యాఖ్యానించాడు.
ఆ స్క్రీన్ షాట్ లో ఒక యూజర్, నిన్ను నేను తప్పకుండా పట్టుకుంటాను. నువ్వు క్షమాపణ చెప్పే వీడియో కన్నా ఆనందం నాకు మరొకటి లేదని రాసి ఉంది.
దీనికి రౌట్లెడ్జ్ రెస్పాన్స్ ఇస్తూ తన అడ్రస్ షేర్ చేశాడు. ‘సార్.. ఓకే సార్.. గుడ్ లక్ సార్.. హాహా.. సార్’ అని ఒక ఇండియన్‌ను ఉద్దేశించినట్లుగా రిప్లై ఇచ్చాడు. ‘సార్ ఐ విల్ కమ్ టూ యువర్ లొకేషన్’ అని వెటకారం చేస్తూ భారతీయులను అవమానకరంగా చూపించే ఫోటో పోస్ట్ చేశాడు.
Indian threatens to find me, it backfires lmao. pic.twitter.com/4xNIYeksrT
— Lord Miles (@real_lord_miles) August 20, 2024
ఈ 25 ఏళ్ళ బ్రిటిష్ యూట్యూబర్, రైటర్ ఇలాంటి రేసిస్ట్ కామెంట్స్ ఇంకా ఎన్నో చేశాడు. ఇండియా మీద అణుబాంబులు వేస్తానని జోక్ చేయడం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఇలా రేసిస్ట్ వ్యాఖ్యలు చేయడమేమిటని ఒక భారతీయుడు చేసిన ఎక్స్ పోస్ట్ మీద రౌట్లెడ్జ్ స్పందిస్తూ, తనకు ఇండియా అంటే నచ్చదని కామెంట్ చేశాడు. ఇండియన్లే తనను బెదిరిస్తున్నారని ఆరోపించాడు.
ఎవరీ మైల్స్ రౌట్లెడ్జ్?
బర్మింగ్‌హామ్‌లోని ఫాల్కన్ లాడ్జ్‌కు చెందిన రౌట్లెడ్జ్ తండ్రి ఒక స్పర్మ్ డోనర్. అతడు ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ప్రక్రియ ద్వారా జన్మించాడు. హోలీఫీల్డ్ స్కూల్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన రౌట్లెడ్జ్, విద్యార్థిగా కొంతకాలం పార్ట్ టైమ్ హెయిర్ డ్రెసర్‌గా పని చేశాడు. లోబరో యూనివర్సిటీలో ఫిజిక్స్ చదివాడు. ఆ తరువాత బ్యాంకింగ్, పైనాన్స్ కోర్సులు చదివాడు. అయితే, యూనివర్సిటీలో ఉండగా ఆయన అఫ్గానిస్తాన్ మీద రాసిన పుస్తకం వివాదాస్పదంగా మారింది.
ఇంకా రకరకాల వివాదాల మూలంగా ఆయన యూనివర్సిటీని వదిలేయాల్సి వచ్చింది.లార్డ్ మైల్స్‌గా సుపరిచితుడైన ఈ వ్యక్తి 2021లో అఫ్గానిస్తాన్‌లో అడుగుపెట్టి డేంజరస్ టూరిస్టుగా వార్తల్లోకెక్కాడు. తాలిబాన్లు కాబూల్‌ను ఆగస్ట్ 15న స్వాధీనం చేసుకోవడానికి రెండు రోజుల ముందు ఆయన ఆ దేశంలో దిగాడు. అక్కడికి వెళ్ళవద్దని స్వదేమైన బ్రిటన్ చేసిన హెచ్చరికలను లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు.
అక్కడ తన అనుభవాలను ఫేస్‌బుక్, ట్విచ్ వంటి సోషల్ మాధ్యమాల్లో షేర్ చేసుకున్నాడు. తాలిబాన్ల అధికారం మొదలయ్యాక భయంతో ఒక సురక్షిత గృహంలో దాక్కున్నాడు. ఆ తరువాత బ్రిటిష్ సైన్యం ఆయనకు ముస్లిం మహిళలా బుర్ఖా తొడిగి ఆగస్ట్ 17న దేశం నుంచి తప్పించింది. అలా బతుకుజీవుడా అని మళ్ళీ బ్రిటన్ చేరుకున్నాడు.
అక్కడితో ఆగాడా? లేదు మళ్ళీ 2022 ఏప్రిల్లో మళ్ళీ తాలిబాన్ల పాలనలోని అఫ్గాన్‌కు వెళ్ళాడు. ఆ దేశంలో ఉన్నప్పుడు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. యాంటిలోప్ హిల్ అనే పబ్లిషింగ్ సంస్థకు తన అఫ్గానిస్తాన్ అనుభవాలను పుస్తకంగా రాయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ప్రమాదకరమైన దేశాలకు తిరగడం అతడికో హాబీలాగా మారింది. కజకిస్తాన్, కెన్యా, యుక్రెయిన్, దక్షిణ సూడాన్ వంటి చాలా దేశాలలో ఈ డేంజరస్ టూరిస్ట్ పర్యటించాడు. కొన్ని చోట్ల అక్రమంగా సరిహద్దులు దాటిన ఆరోపణలో జైల్లో కూడా పడ్డాడు.
అఫ్గానిస్తాన్‌కు మూడోసారి 2023 ఫిబ్రవరిలో వెళ్ళినప్పుడు ఆ దేశ ఇంటలిజెన్స్ విభాగం ఆయనను అదుపులోకి తీసుకుంది. కొన్ని నెలల తరివాత 2023 అక్టోబర్ నెలలో విడుదలయ్యాడు. నిర్బంధంలో తనను అధికారులు బాగా చూసుకున్నారని, విలాసవంతమైన గెస్ట్ హౌజులో ఉంచారని చెప్పారు. తనకు ఎక్స్ బాక్స్ వంటివి ఇచ్చారు, పిజ్జాలు తెప్పించారని కూడా చెప్పుకున్నాడు.
భారత్ మీదే కాదు ఆఫ్రికా వంటి దేశాల మీద కూడా ఈ వ్యక్తి రేసిస్ట్ పోస్టులు పెడుతూనే ఉన్నాడు. ఈ ఆగస్ట్ నెల మొదట్లో ఓ ఎక్స్ పోస్టులో అతడు, భారతదేశంలో అధిక జనాభా సమస్య పరిష్కరించేందుకు తాను ఒక వైరస్ గా పుడతానని అన్నాడు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



