లండన్‌లో కొనసాగుతున్న బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్- 2 అంత్యక్రియలు

*బ్రిటన్ రాణికి కన్నీటి వీడ్కోలు పలుకుతున్న లక్షలాది మంది ప్రజలు

Rama Rao
Published on: 19 Sept 2022 4:28 PM IST
British Queen Elizabeth II Funeral Day Live Updates
X

లండన్‌లో కొనసాగుతున్న బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్- 2 అంత్యక్రియలు 

Elizabeth II Funeral: బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 అంతిమయాత్ర కొనసాగుతోంది. రాచరికపు సంప్రదాయాలతో వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను పాటిస్తూ రాణికి తుది వీడ్కోలు పలుకుతున్నారు ప్రజలు. ఇప్పటికే లండన్‌కు చేరుకున్న లక్షలాది మంది ప్రజలు రాణికి అశ్రు నయనాలతో తుది వీడ్కోలు పలుకుతున్నారు. బ్రిటన్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రాణి అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు వెస్ట్ మినిస్టర్ అబేలో రాణి అంత్యక్రియలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వెస్ట్ మినిస్టర్ డీన్ డేవిడ్ హోయల్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. వేలాది మంది బిషప్‌లు వెస్ట్ మినిస్టర్ అబేలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story