UK: హెచ్ఐవీ టెస్టు చేయించుకున్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్

UK: హెచ్ఐవీ టెస్టు చేయించుకున్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్
x
Highlights

UK: బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హెఐవీ పరీక్షను చేయించుకున్నారు. జీ7 నాయకుల్లో బహిరంగంగా హెచ్ఐవీ టెస్ట్ చేయించుకన్న మొదటి ప్రధాని స్టార్మర్ అని ఆయన...

UK: బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హెఐవీ పరీక్షను చేయించుకున్నారు. జీ7 నాయకుల్లో బహిరంగంగా హెచ్ఐవీ టెస్ట్ చేయించుకన్న మొదటి ప్రధాని స్టార్మర్ అని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్బంగా దేశ ప్రజలంతా ముందుకు వచ్చి టెస్టులు చేయించుకోవాలని పిలుపునిచ్చింది. హెచ్ఐవీ టెస్ట్ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని స్టార్మర్ హెచ్ఐవీ టెస్టు చేయించుకున్నారు. టెరెన్స్ హిగ్గిన్స్ సంస్థతో కలిసి ర్యాపిడ్ హోమ్ టెస్ట్ చేయించుకున్నారని ఓ ప్రకటనలో పేర్కొంది.

హెచ్ఐవీ టెస్టు ఎంతో ముఖ్యమైందని ఇందులో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని స్టార్మర్ వెల్లడించారు. క్షణాల్లో జరిగిపోయే ఈ టెస్టును వారం రోజులపాటు ఫ్రీగా పొందవచ్చన్నారు. 2023 నాటికి కొత్త హెచ్ఐవీ కేసులు నమోదువ్వకూడదనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రజలు ముందుకు వచ్చి పరీక్ష చేయించుకోవాలని కోరారు.

2023 నాటికి ఒక్క హెచ్ఐవీ కేసు నమోదు కాకూడదనే లక్ష్యానికి స్టార్మర్ కట్టుబడి ఉన్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. దీనికి సంబంధించి ఈ ఏడాదిలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించినట్లు వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories