Saree Walkathon In London: చేనేత వస్త్రాలకు సరికొత్త ప్రచారం.. లండన్‌ వీధుల్లో చీరకట్టులో వాక్‌థాన్

Saree Walkathon In London: ప్రదర్శన పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన 500 మంది మహిళలు

Shekhar G
Published on: 8 Aug 2023 3:00 PM IST
British Indian Women Conducts Saree Walkathon 2023 In London On National Handloom Day
X

Saree Walkathon In London: చేనేత వస్త్రాలకు సరికొత్త ప్రచారం.. లండన్‌ వీధుల్లో చీరకట్టులో వాక్‌థాన్

Saree Walkathon In London: లండన్‌లో జరిగిన ప్రారంభ చీరల వాకథాన్‌లో భారత చేనేత వారసత్వంపై అవగాహన కల్పించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో గణనీయమైన పాత్ర పోషించిన చేనేత స్వదేశీ ఉద్యమానికి సంఘీభావం తె‎లిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది మహిళలు చేనేత వస్త్రాలతో ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ట్రాఫల్గర్ స్క్వేర్ నుంచి వెస్ట్ మినిస్టర్‌లోని చారిత్రక పార్లమెంట్ స్క్వేర్ మీదుగా 10 డౌనింగ్ స్ట్రీట్ వరకు ఈ వాకథాన్ సాగింది.

డాక్టర్ దీప్తి జైన్ నేతృత్వంలో బ్రిటిష్ ఉమన్ ఇన్ చీరల బృందం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఇన్‌స్పైరింగ్ డబ్ల్యూ గ్లోబల్ హారో కేర్ మద్దతు ఇచ్చింది. పార్లమెంటు స్క్వేర్‌‌లో వివిధ రాష్ట్రాల మహిళల సాంప్రదాయ నృత్య ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. పోచంపల్లి, గద్వాల, వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ వంటి ప్రముఖ రకాల చేనేత చీరలను భారత మహిళలు ప్రదర్శించారు.

Shekhar G

Shekhar G

Next Story