Brazil President Bolsonaro's son tests positive: బ్రెజిల్ అధ్యక్షుడి కుమారుడికి కరోనా

Brazil President Bolsonaro’s son tests positive: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌ను గ‌జ‌గ‌జ‌లాడిస్తుంది. చిన్న , పెద్ద‌, పేద‌, ధ‌నిక అనే ఎలాంటి భేదాలు లేకుండా అంద‌రిపై త‌న పంజా విసురుతుంది

Karampoori Rajesh
Published on: 26 Aug 2020 8:08 PM IST
Brazil President  Bolsonaros son  tests positive: బ్రెజిల్ అధ్యక్షుడి కుమారుడికి కరోనా
X

Flavio Bolsonaro 

Brazil President Bolsonaro's son tests positive: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌ను గ‌జ‌గ‌జ‌లాడిస్తుంది. చిన్న , పెద్ద‌, పేద‌, ధ‌నిక అనే ఎలాంటి భేదాలు లేకుండా అంద‌రిపై త‌న పంజా విసురుతుంది. అత్యంత జాగ్ర‌త్తగా ఉండే వీవీఐపీల‌ను సైతం విడిచిపెట్ట‌డం లేదు. తాజాగా బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బొల్సనారో కుమారుడు, సెనేటర్ ఫ్లావియో బొల్సనారోకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఫ్లావియోనే స్వయంగా వెల్లడించారు. అయితే తను బాగానే ఉన్నానని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని ఆయన చెప్పారు.

అలాగే యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకుంటున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. బ్రెజిల్ అధ్యక్షుడి కుటుంబంలో కరోనా సోకిన వారిలో ఫ్లావియో నాలుగో వ్యక్తి. ఇటీవలే జైర్ బొల్సనారో కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. అంతేగాక ఆయన భార్య, నాలుగో కుమారుడికి కూడా కరోనా సోకింది.

బ్రెజిల్ అధ్య‌క్షుడు జైర్ బోల్సొనారో (65)కు వరుసగా మూడోసారి కూడా క‌రోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. తాజాగా ఆయనకు మరోసారి పాజిటివ్‌ వచ్చింది. అధికార నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉంటూ అక్క‌డి నుంచే అధికార కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తాన‌ని బోల్సొనారో ప్ర‌క‌టించారు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story